Gold Price Today : మగువలకు బాక్సింగ్ డే రోజు షాకిచ్చిన బంగారం ధరలు..ఇంత పెరుగుదలా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది

Update: 2024-12-26 03:18 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయని ముందు నుంచి అంచనాలు వినిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు అధికంగా ఉంటాయని కూడా మార్కెట్ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఇయర్ ఎండింగ్ నుంచే ధరలు పెరగడం ప్రారంభించాయి. నిన్నటివరకూ కొంత తగ్గినట్లు కనిపించిన బంగారం, వెండి ధరలు మరలలా పెరగడం ప్రారంభించాయి. కాస్తో కూస్తో కాదు.. పెరగడం భారీగానే పెరగడంతో వినియోగదారులు హతాశులయ్యారు. కొత్త ఏడాదికి కొత్త ఆభరణాలతో స్వాగతం పలకాలుంటున్న వారికి ధరలు షాకిచ్చినట్లే కనిపిస్తున్నాయి. అసలే కొనుగోళ్లు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ధరలు పెరగడంతో ఇంకా దానిపై ప్రభావం చూపే అవకాశముంది.

సెంటిమెంట్ గా కూడా...
అదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వెండి బంగారంతో పాటు పరుగులు పెడుతుంది. వెండి దాదాపు లక్ష రూపాయలకు మళ్లీ కిలో చేరుకుంది. బంగారం, వెండి అంటేనే స్టేటస్ సింబల్ గా మాత్రమే కాదు.. సెంటిమెంట్ గా కూడా చూస్తారు. అందువల్లనే జనరేషన్ లు మారినా బంగారం ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. పాత కాలం వారు మాత్రమే బంగారం కొనుగోలు చేస్తారన్నది అపోహ మాత్రమే. కొనుగోలు శక్తి పెరగడంతో ప్రజలు బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావించి, అందులో లాభాలు వస్తాయని గ్రహించిన అనేక మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
వెండి తగ్గిందిగా...
దేశంలో బంగారం, వెండి ధరలు ఇప్పుడు కొత్తేమీ కాదు. ప్రతి రోజూ ధరలు పెరుగుతుంటాయి. పదేళ్ల క్రితం పది గ్రాముల బంగారం ధరకు నేటి బంగారం ధరకు అసలు పొంతనే లేదు. నాడు కొనుగోలు చేసిన వారు నేడు ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు కొనుగోలు చేయడానికి కూడా పేద, మధ్యతరగతి ప్రజలు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. దానికి ధరలు భారీగా పెరగడమే కారణం. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,010 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,460 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 99,100 రూపాయలకు దిగింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 


Tags:    

Similar News