Gold Price Today : భారీగా పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.
బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరసగా రెండు రోజుల నుంచి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో కొద్దిగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పరుగును ప్రారంభించాయి. ధరలు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు కనిపిస్తాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సీజన్ నడుస్తుండటంతో...
పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తుంది. అందుకే కొనుగోళ్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో బంగారం ధరలు పెరిగినా కొనుగోళ్లు తగ్గవన్నది వ్యాపారుల అంచనా. మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. అదే సమయంలో మంచి ముహూర్తాలు కూడా ఉండటంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. పెట్టుబడిదారులు మాత్రం ధరలు పెరిగినప్పుడు కంటే తగ్గినప్పుడే కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. మదుపరులు ఎక్కువ మంది భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే బంగారానికి ఎనీ టైం డిమాండ్ తగ్గదన్నది వ్యాపారుల అభిప్రాయం.
నేటి బంగారం ధరలు...
బంగారం, వెండి ధరలు పరుగులు ప్రారంభించాయంటే ఇక ఆగే పరిస్థితి కనిపించదు. ఎందుకంటే అనేక కారణాలతో వాటి ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర పై 710 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,080 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,01,100 రూపాయలకు మళ్లీ చేరుకుంది. ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలు. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు.