Gold Price Today : కొత్త ఏడాది ఇక బంగారం ధరలు అందుబాటులో ఉండవేమో.. ఈ ధరల పెరుగుదల చూస్తే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి

Update: 2024-12-28 02:53 GMT

బంగారం ధరలు కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాదికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక కొత్త ఏడాది ప్రారంభం నుంచి మరింతగా ధరలు పెరుగుతాయని అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది సంవత్సరాంతంలోనే ధరల పెరుగుదల పసిడి ప్రియులకు నిరాశ కలిగిస్తున్నాయి. అంతకు ముందు కొద్దిగా ధరలు తగ్గినట్లు కనిపించినా మళ్లీ ధరలు పెరగుతుండటంతో వినియోగదారులు కొనుగోలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో పడిపోయారు. తిరిగి పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరువలో ఉంది. అలాగే కిలో వెండి ధర కూడా లక్ష రూపాయలుగా నమోదవడం ఆందోళన కలిగిస్తుంది.


కొనుగోళ్లపై ప్రభావం...

ఎంత సీజన్ అయినా ఇలా బంగారం ధరలు వరసగా పెరగడం చూడటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అసలే ధరలు పెరగడంతో బంగారం కొనుగోళ్లు తగ్గాయని లబోదిబోమంటున్న వ్యాపారులకు ఇలా ధరలు పెరిగితే మరితంగా కొనుగోళ్లు తగ్గుతాయని అంటున్నారు. ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం కూడా బంగారం ధరల పెరుగుదలపై పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే మరింత తగ్గడం కూడా పసిడి ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. ఇలా అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు ఇప్పుడే పెరిగితే వచ్చే ఏడాది ప్రారంభానికి ఇక అందనంత దూరంలో ఉంటాయని, అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో తాము కొనుగోలు చేయడం కష్టమేమోనన్న ఆందోళనలో ఉన్నారు.
అమాంతం పెరగడంతో...
బంగారం, వెండి ధరలు అమాంతంగా పెరగడానికి అనేక కారణాలున్నప్పటికీ పెట్టుబడి పెట్టేవారు సయితం ముందుకు రావడం లేదు. అంత ధరలను పెట్టి కొనుగోలు చేయడం కంటే తగ్గినప్పుడు చూద్దాంలే అన్నట్లు పెట్టుబడిదారులు భావించడమే ఇందుకు కారణం. గోల్డ్ బిస్కట్ల విక్రయాలు కూడా దారుణంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,510 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,010 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,900 రూపాయలకు చేరుకుంది.




Tags:    

Similar News