PM Modi: రైతుల కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనుందా?

దేశంలో మోడీ సర్కార్‌ ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు

Update: 2024-07-13 10:02 GMT

PM Modi

దేశంలో మోడీ సర్కార్‌ ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే రైతుల కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటుంది మోడీ సర్కార్‌. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది. ఈ మొత్తం ఒకే సారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే తాజాగా మరో వార్త ప్రచారం జరుగుతోంది. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో పీఎం కిసాన్‌ నిధుల సొమ్మును పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.6000 నుంచి రూ.8000 పెంచే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. అంటే ఈ స్కీమ్‌లో 30 శాతం పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ఉన్నాయి. 23వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

బిజినెస్ టుడే నివేదిక ప్రకారం, కిసాన్ యూనియన్‌కు చెందిన బద్రి నారాయణ్ చౌదరి మాట్లాడుతూ, పిఎం కిసాన్ కింద కేటాయింపులను రూ.6,000 నుండి రూ.8,000కి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించాము. సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే బడ్జెట్‌లో రైతులకు పీఎం కిసాన్‌ స్కీమ్‌లో ఏడాదికి 8 వేల రూపాయలు చేయవచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News