CIBIL Score: సిబిల్ స్కోర్ ఎంత ఉందో తెలియడం లేదా? ఇలా చెక్ చేసుకోండి!
CIBIL Score: బ్యాంకు నుంచి ఏదైనా రుణం కావాలంటే ముందుగా సిబిల్ స్కోర్ ఉండాల్సిందే. ఇది లేకుంటే ఎలాంటి రుణాలు
CIBIL Score: బ్యాంకు నుంచి ఏదైనా రుణం కావాలంటే ముందుగా సిబిల్ స్కోర్ ఉండాల్సిందే. ఇది లేకుంటే ఎలాంటి రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతాయి. అయితే చాలా మంది రుణాలు తీసుకుని ఈఎంఐలు సరిగ్గా చెల్లించకుంటే సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంటుంది. ఆ ప్రభావం చాలా ఉంటుంది. లోన్ తీసుకునే సమయంలో దీని ఎఫెక్ట్ చాలా ఉంటుందని గుర్తించుకోండి. బ్యాంకు ఖాతా ఉన్నవారు లావాదేవీలు జరడంలో, లోన్ తీసుకుని ఈఎంఐలు చెల్లించేటప్పుడు నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది. సాధారణంగా 750 పాయింట్లకు పైగా స్కోర్ ఉంటే అది బెస్ట్ సిబిల్ స్కోర్‌గా పరిగణలోకి తీసుకుంటారు. ఇంతకీ మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా.? సిబిల్ స్కోర్‌ను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సిబిల్ స్కోర్ తెలియాలంటే మీకు కచ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందే. పాన్ ఆధారంగానే ఒక వ్యక్తి ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. పాన్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ, పేరు వంటి వివరాలతో సిబిల్ స్కోర్‌ను తెలుసుకోవచ్చు. దేశంలో పలు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ రిపోర్ట్‌లను అందిస్తాయి. సిబిల్, ఈక్విఫ్యాక్స్, ఎక్స్పీరియన్ వంటి వెబ్ సైట్లలో సిబిల్ స్కోర్‌లను చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
ఇలాంటి వాటిలో సిబిల్.కామ్ అనే వెబ్‌సైట్ ఒకటి. ఈ వెబ్‌సైట్ ద్వారా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు. ముందుగా సిబిల్.కామ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం హోమ్ పేజీలో కనిపించే ‘గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ మెయిల్ అడ్రస్, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఈ వివరాలన్ని అందిస్తే మీ పూర్తి సిబిల్ స్కోర్ మీ మెయిల్ ఐడీకి డాక్యుమెంట్ రూపంలో వస్తుంది. ఇందులో మీ సిబిల్ స్కోర్‌తో పాటు మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి.? ఈఎమ్‌ఐ సరిగ్గా చెల్లిస్తున్నారా.? లేదా.? లాంటి పూర్తి వివరాలు సమగ్రంగా అందుబాటులో ఉంటాయి.