నేషనల్‌ హైవేపై ఈ బాక్స్‌లు ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర

Highways SOS Box: సాధారణంగా మనం ప్రయాణాలు చేస్తుంటాము. అయితే నేషనల్‌ హైవేపై ప్రయాణం చేసేవాళ్లు చాలా

Update: 2023-12-28 09:37 GMT

SoS Boxes

Highways SOS Box: సాధారణంగా మనం ప్రయాణాలు చేస్తుంటాము. అయితే నేషనల్‌ హైవేపై ప్రయాణం చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఆ హైవేపై కొన్ని విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైవేపై అధికారులు ఏర్పాటు చేసిన కొన్ని ఏర్పాట్లు మన ప్రాణాలను కాపాడుతుంటాయి. ఇకపోతే రోడ్డు ప్రమాదాలు అనేవి నేషనల్‌ హైవేపై ఎక్కువగా జరుగుతుంటాయి. రహదారి చాలా వెడల్పుగా ఉండటం, ఎలాంటి స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం, వాహనాల రద్దీ పెద్గగా ఉండకపోవడం కారణంగా వాహనాలు చాలా స్పీడ్‌గా వెళ్తుంటాయి. అలాంటి సమయంలో రోడ్డు ప్రమాదాలు కూడా చాలానే జరుగుతుంటాయి. ఏదో పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరైనా వచ్చిన కాపాడుతారు. సహాయం చేస్తుంటారు. కానీ హైవేపై ఉన్న సమయంలో సమీపంలో ఎవ్వరు కూడా ఉండరు. అలాంటి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే సహాయం అందడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు తక్షణమే సహాయం అందుకోవడానికి రోడ్డుపక్కన కొన్ని బాక్స్‌లను ఏర్పాటు చేస్తుంటారు.

ఆ బాక్స్‌లను SOS అంటాము. అంటే Save our Sole. మీరు కూడా హైవేపై ప్రయాణించినప్పుడు ఈ SOS బాక్స్‌లను గమనించి ఉంటారు. వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తారనే అనుమానం కూడా రావచ్చు. ఈ హెల్ప్‌లైన్‌ బాక్స్‌లు ప్రతి ఒక నేషనల్‌ హైవే మీద ఏర్పాటు చేసి ఉంటాయి. ప్రతి 300 మీటర్లకో బాక్స్‌ ఖచ్చితంగా ఉంటుంది. ఈ బాక్స్‌ మన ప్రాణాలను కాపాడుతుంది. మనం హైవేపై వెళ్తుండగా, ఏదైనా యాక్సిడెంట్‌అయి ఫోన్‌ కూడా డ్యామేజ్‌ అయినట్లయితే రోడ్డు పక్కన ఉండే ఈ బాక్స్‌ వద్దకు వెళ్లి అక్కడ కనిపించే బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేసి యాక్సిడెంట్‌ జరిగిందన్నట్లు వాయిస్‌ ఇవ్వాలి. వెంటనే మీ వాయిస్‌ సమీపంలో ఉన్న అంబులెన్స్‌, పోలీసుస్టేషన్‌, టోల్‌ప్లాజా, ఫైర్‌ స్టేషన్‌కు వెళ్తుంది.

అంతేకాదు మన లోకేషన్‌కు చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వాళ్లకు లోకేషన్‌ వెళ్తుంది. వెంటనే మీకు అంబులెన్స్‌ గానీ, పోలీసులు గానీ తక్కువ సమయంలోని మీరు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం, సహాయం చేయడం లాంటి చకచక జరిగిపోతుంటాయి. ఒక వేళ యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతంలో బాక్స్‌లేనట్లయితే మీ ఫోన్‌ నుంచి 1033 నంబర్‌కు కాల్‌ చేసినా వాళ్లు వచ్చి మీకు హెల్ప్‌ చేస్తారు. సో.. ఇదన్నమాట సహాయం కోసం ఇలాం నేషనల్‌ హైవేపక్కన ఈ బాక్స్‌లు ఏర్పాటు చేస్తారు.

Tags:    

Similar News