35 ఏళ్ల వ్యక్తితో 55 ఏళ్ల మహిళ స్నేహం.. చివరికి!!

కొన్ని నెలల క్రితం పరిచయమై ఆ తర్వాత దగ్గరైన వ్యక్తి చేతిలో;

Update: 2024-10-03 09:05 GMT
Police, NewDelhi, Sunil,55-year-old woman accusing 35 years old sunil in new delhi  latest news in delhi today telugu, new delhi Safdarjung Enclave latest news, latest crime news in delhi

 crime news in delhi

  • whatsapp icon

కొన్ని నెలల క్రితం పరిచయమై ఆ తర్వాత దగ్గరైన వ్యక్తి చేతిలో ఓ మహిళ లైంగికంగా వేధింపులకు గురైంది. తనకు మత్తుమందు ఇచ్చి సదరు వ్యక్తి లైంగికంగా వేధించాడని 55 ఏళ్ల మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని సునీల్ (35)గా గుర్తించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 30న సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌ కు ఓ ఫోన్ వచ్చింది. ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైనట్లు అందులోని సమాచారం. కొన్ని నెలల కిందట పరిచయమైన వ్యక్తి చేతిలో తాను మోసపోయానని ఆ మహిళ వాపోయింది.

జనవరి 1న లోధి రోడ్డు సమీపంలో నిందితుడిని మొదటి సారి కలిశానని మహిళ పోలీసులకు తెలిపింది. ఓ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు సదరు వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఢిల్లీలో ఒక ఫ్లాట్‌ను వెతకడానికి తనకు సహాయం చేయమని సునీల్ ఆ మహిళను కోరాడు. వారు ఫోన్ నంబర్‌లను మార్చుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ సాగిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఆ మహిళను సునీల్ హోటల్ కు రమ్మని ఆహ్వానించాడు. అయితే అతడిని నమ్మి వెళ్లిన ఆమె తనను హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తు మందు కలిపిన డ్రింక్ ను తనకు తాగించాడని, ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత కింద అత్యాచారం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Tags:    

Similar News