Road Accident : రోగిని తరలిస్తున్న అంబులెన్స్ కు ప్రమాదం.. నలుగురి మృతి

ఒక రోగిని తరలిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు;

Update: 2024-12-01 12:55 GMT

ఒక రోగిని తరలిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ అంబులెన్స్ ఏపీలోని కర్నూలు నుంచి బీహార్ కు వెళుతుండగా నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం జరిగింది. బీహార్ లోనిచంపారన్ కు తరలిస్తున్న అంబులెన్స్ మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో ఈరోజు ఉదయం ప్రమాదానికి గురయింది. అంబులెన్స్ ఒక వ్యక్తిని ఢీకొట్టి అనంతరం స్థంభానికి ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది.

బీహార్ కు కర్నూలు నుంచి...
అనిష్ షా అనే రోగిని కర్నూలు నుంచి బీహార్ కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రోగికి చెందిన ఆరుగురు కుటుంబసభ్యులతో పాటు ఇద్దరు డ్రైవర్లున్నారు. ఇందులో రోగి బంధువులు నలుగురు మరణించారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. గాయాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు జబల్ పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం వారి కుటుంబంలో విషాదం నింపింది


Tags:    

Similar News