Breaking : అత్తమామలను చంపేందుకు కోడలు ప్లాన్.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం?

బేగంబజార్ లో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తామామలను చంపించేందుకు కోడలు ప్రయత్నించింది;

Update: 2024-05-17 07:36 GMT
tragedy,  gas cylinder explosion, annamaya district, rayachoti

attapur khaleel murder

  • whatsapp icon

బేగంబజార్ లో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా అత్తామామలను చంపించేందుకు కోడలు ప్రయత్నించింది. బేగంబజార్ కట్టెల మండీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్తామామలను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కోడలు కుట్ర పన్నింది. ఇందుకోసం సుపారీ ఇచ్చి ఒక గ్యాంగ్ కు వారిని హతమార్చేందుకు బాధ్యతను అప్పగించింది.

ముగ్గురిని ఆసుపత్రికి తరలించి...
ఇంట్లో ఉండగా దుండగులు చొరబడి అత్త, మామలతో పాటు భర్తపై కూడా దాడికి దిగారు. వారు వేసిన కేకలకు దుండగులు పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోడలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags:    

Similar News