ఆర్టీసీ బస్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య
బెంగాల్ కు చెందిన బిసు గత కొన్ని సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాదుకు వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా..
ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బిసు రాజబ్ (40) అనే వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొండాపూర్ చౌరస్తాలో అత్యంత వేగంగా వెళుతున్న బస్సు కింద తలపెట్టి బిసు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది చూసిన స్థానికులు వెంటనే అతన్ని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అయితే బిసు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతను ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
బెంగాల్ కు చెందిన బిసు గత కొన్ని సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాదుకు వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పోలీసులు బిసు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. మరోవైపు బిసు బస్సు కింద తలపెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినప్పుడు అక్కడ ఉన్న సిసి కెమెరాలు ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బిసు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సమయంలో అక్కడున్న కొంతమంది స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు కానీ బిసు వారి నుండి తప్పించుకొని అత్యంత వేగంగా వస్తున్న బస్సు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు బిసు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.