పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ పై ఘోరప్రమాదం

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం;

Update: 2023-07-16 04:44 GMT
పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ పై ఘోరప్రమాదం
  • whatsapp icon

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఆరాంఘర్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న కారు టైర్ పెద్దశబ్దంతో పేలిపోవడంతో.. డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ పై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజేంద్రనగర్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News