అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

అనంతపురం జిల్లాలో విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు

Update: 2024-12-01 03:01 GMT

 Rangampally road accident

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

మంచువల్లనే....
మంచు అధికంగా కురుస్తున్నందు వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. మృతులను బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్‌, గోవిందరాయ, అమరేశ్‌గా గుర్తించారు. వీరంతా హాంకాంగ్‌ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News