విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేలుడు.. 9 మందికి గాయాలు

వెంటనే గాయపడిన వారిని స్టీల్ ప్లాంట్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని..;

Update: 2023-02-11 12:27 GMT
central government,  good news to steel plant vishaka , visakhapatnam latest news today, workers of visakhapatnam steel plant latest news telugu,  ap top stories today

 vizag steel plant

  • whatsapp icon

విశాఖ స్టీల్ ప్లాంట్ లిక్విడ్ విభాగంలో పేలుడు సంభవించింది. శనివారం ఎస్ఎంఎస్ 2 లిక్విడ్ విభాగంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు ద్రవంలో పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని స్టీల్ ప్లాంట్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని గాజువాకలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు రెగ్యులర్‌ కార్మికులు కాగా, ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.

ఫ్లాగ్ యాష్‌ ను తొలగించే క్రమంలో, నీళ్లు పడడంతో తొమ్మిదిమంది ద్రవంలో పడిపోయారు. గాయపడినవారిలో 9 మందికి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిలో ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ద్రవరూపంలో ఉండే ఉక్కును నిల్వ చేసే క్రమంలో సరైన సేఫ్టీ పద్దతులు పాటించకపోవడం వల్లనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.





Tags:    

Similar News