అస్సాంలో అరెస్ట్‌లు.. 2,041 మందిని ఒకేసారి
మైనర్లను వివాహం చేసుకున్న వారిని అస్సాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
మైనర్లను వివాహం చేసుకున్న వారిని అస్సాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీనిని తీవ్రమైన నేరంగా భావించిన అస్సాం ప్రభుత్వం నిన్న భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించి మైనర్లను మ్యారేజ్ చేసుకున్న వారిని గుర్తించింది. మొత్తం 2,044 మంది మైనర్లను పెళ్లి చేసుకున్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేసింది.
సహకరించిన...
వీరికి సహకరించిన 51 మంది పూజారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని తెలిసినా కొందరు కావాలని మైనర్లను వివాహం చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ తెలిపారు. ఇప్పటి వరకూ ఎనిమిది వేల మందిని గుర్తించారు. వీరిలో రెండు వేలకు మందికి పైగానే అరెస్ట్ చేశారు. వీరిపై పోక్సో యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.