హైదాబాద్ లో దారుణం.. భార్యను చంపి తలతో?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను గొంతుకోసి భర్త పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.;

Update: 2021-12-10 03:39 GMT
murder, kadiri, ananathapuram district
  • whatsapp icon

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను గొంతుకోసి భర్త పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. రాజేంద్ర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు తన భార్య తలతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. రాజేంద్ర నగర్ కు చెందిన పర్వేజ్, సమ్రీన్ బేగంలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు.

అనుమానమే....?
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అనుమానంతో భార్యను వేధించేవాడు. పర్వేజ్ వేధింపులకు తట్టుకోలేక వెళ్లిపోయిన బేగంను ఏడాది క్రితం బతిమాలి తిరిగి పర్వేజ్ ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పర్వేజ్ తన భార్యను గొంతు కోసి చంపాడు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ముగ్గురు పిల్లలు అనాధగా మారారు.


Tags:    

Similar News