స్పా ల ముసుగులో వ్యభిచారం.. హైదరాబాద్ లో చీకటి దందా
యువతులకు ఉద్యోగాల పేరుతో వల విసిరి.. స్పా సెంటర్లకు తీసుకువచ్చి వ్యభిచారకూపంలోకి దించుతున్నట్లు పోలీసులు అనుమానం..;
హైదరాబాద్ లో మరోసారి చీకటిలో నడుపుతున్న వ్యభిచార దందా గుట్టు రట్టయింది. పక్క సమాచారంతో పోలీసులు.. రెండు స్పా సెంటర్లపై దాడులు చేయగా.. అక్కడ వ్యభిచారం చేస్తున్నవారిని పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్వహిస్తున్న RUANథాయ్ స్పా సెంటర్ పై, రోడ్ నంబర్ 1లో నిర్వహిస్తున్న ఆయుష్ బ్యూటీ స్పా సెంటర్ పై దాడులు చేసి ఐదుగురు ఆర్గనైజర్లను అరెస్ట్ చేశారు. రెండు స్పా సెంటర్లలో ఉన్న 10 మంది అమ్మాయిలు, ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు.
విటులు, ఆర్గనైజర్లను జైలుకు తరలించి, అమ్మాయిలను మరో ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. కాగా.. యువతులకు ఉద్యోగాల పేరుతో వల విసిరి.. స్పా సెంటర్లకు తీసుకువచ్చి వ్యభిచారకూపంలోకి దించుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బ్యూటీపార్లర్, స్పా సెంటర్లకు వచ్చే కస్టమర్ల పేర్లు, ఫోన్ నంబర్ల వివరాలు నమోదు చేసుకునేందుకు రిజిస్టర్ మెయింటెన్ చేస్తారు. కానీ.. ఈ రెండు స్పా సెంటర్లలో అలాంటివేమీ దొరకలేదని సమాచారం. ఒకేసారి రెండు స్పా సెంటర్లలో వ్యభిచార ముఠా గుట్టురట్టు విషయం నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.