Road Accident : రెండు కార్లు ఢీ - ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు;

Road accident took place on the devarapalli highway of east godavari district.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో వెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు.
టైర్ పంక్చర్ కావడంతో...
ఈ రోడ్డు ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. రెండుకార్లలో కలిపి మరో 8మందికి గాయాలయ్యాయి. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.