Road Accident : రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

హైదరాబాద్ - వరంగల్ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.;

Update: 2025-01-16 04:23 GMT

హైదరాబాద్ - వరంగల్ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.భువనగిరి బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగామరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

పొగమంచు కారణంగా...
మృతుల్లో ఓ మహిళ,చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. పొగమంచు అధికంగా ఉండటంతో పాటు అధికవేగంగా వచ్చి వేగంగా వెనక నుంచి కారు లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News