సురేష్ గోపి సోదరుడు అరెస్ట్

ప్రముఖ మళయాళీ నటుడు సురేష్ గోపి సోదరుడు సునీల్ గోపిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు;

Update: 2022-03-21 04:16 GMT
suresh gopi, sunil gopi, arrest, land scam, kerala
  • whatsapp icon

ప్రముఖ మళయాళీ నటుడు సురేష్ గోపి సోదరుడు సునీల్ గోపిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక భూ కుంభకోణానికి సంబంధించి ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న భూమిని సునీల్ గోపి విక్రయించారన్న ఆరోపణలున్నాయి. దీంతో కోయంబత్తూరు పోలీసులు సునీల్ గోపిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

భూ వివాదంలో....
కోయంబత్తూరుకు చెందిన జీఎన్ మిల్స్ లో ఉంటున్న గిరిధరన్ కు కోర్టు తీర్పును థిక్కరించి 4.52 ఎకరాల భూమిని విక్రయించారు. సునీల్ గోపి ఈ స్థలాన్ని నవకరై కు చెందిన మయిల్ సామి వద్ద నుంచి కొనుగోలు చేశాడు. దీనిపై బాండ్ రిజిస్ట్రేషన్ చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. అయినా స్థలాన్ని గిరిధరన్ కు సునీల్ గోపి విక్రయించాడు. గిరిధరన్ ఫిర్యాదుతో సునీల్ గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News