గ్యాస్ సిలిండర్ పేలి.. ఎనిమిది మంది మృతి
పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఎనిమిది మంది మరణించారు;

పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఎనిమిది మంది మరణించారని చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారంతా మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లోని 24 దక్షిణ పరిగణాల జిల్లాలోని పథార్ ప్రతిమా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఇంట్లో బాణసంచా తయారీకి ఉపయోగిస్తున్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన...
సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టు పక్కల వారు అగ్ని ప్రమాదశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో మొత్తం పదకొండు మంది ఉండగా అందులో ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. సిలిండర్ పేలుడు వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.