Road Accident : తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.;

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. గోదావరి ఖనికి చెందిన అహ్మద్, గౌస్ లు కారులో సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లికి వెళుతుండగా కారు అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరూ స్పాట్ లోనే మరణించారు.
అతివేగమే ప్రమాదానికి...
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు. వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో వారు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది.