Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.;

Update: 2025-01-11 03:36 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నిన్న అర్ధరాత్రి మహబూబ్ నగర్ జడ్చర్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు పదిహేను మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

టైర్ పంక్చర్ కావడంతో...
పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే వేగంగా వెళుతుండగా కారు టైర్ పంక్చర్ కావడంతో ముందు నిలిపేశాడు. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో లారీ డ్రైవర్ కూడా ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో వెనక నుంచి వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు లారీని వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News