Breaking : సూర్యాపేట జిల్లాలో విషాదం.. నీటి గుంటలో పడి ముగ్గురి మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. క్వారీ గుంతలో పడి ముగ్గురు మరణించారు;

Update: 2024-07-17 06:18 GMT
accident, electric wires, hajipur district,  bihar
  • whatsapp icon

సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. క్వారీ గుంతలో పడి ముగ్గురు మరణించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు యువకులు ఒక బాలిక ఉన్నారని పోలీసులు తెలిసారు. క్వారీ గుంతల్లో ఈత కొట్టేందుకు వెళ్లిన వారు ఒక్కసారిగా లోతులోకి వెళ్లడంతో మరణించారని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.

ఈతకు వెళ్లి..
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నీటి గుంటలో పడి మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News