Mexico : వేర్వేరు చోట్ల కాల్పులు.. పదహారు మంది మృతి

మెక్సికోలో మళ్లీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పన్నెండు మంది మరణించారు;

Update: 2023-12-18 06:58 GMT
shooting, mexico, christmas celebrations, 16 died, crime news, world news

mexico

  • whatsapp icon

మెక్సికోలో మళ్లీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పన్నెండు మంది మరణించారు. క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో పన్నెండు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మెక్సికో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారు జామున క్రిస్మస్ వేడుకల్లో కాల్పులకు తెగపడటంతో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు.

క్రిస్మస్ పార్టీ జరుపుకుని...
క్రిస్మస్ పార్టీ జరుపుకుని బయటకు వస్తుండగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అలాగే మెక్సికో రాష్ట్రంలోని సలామంకా నగరంలోనూ కాల్పుల్లో నలుగురు మరణించారు. దీంతో ఆదివారం జరిగిన వేర్వేరు చోట జరిగిన కాల్పుల్లో పదహారు మంది మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News