గోదావరిలో మునిగి ముగ్గురి మృతి
కోనసీమలో విషాదం నెలకొంది. గోదావరిలో పడి ముగ్గురు మరణించారు.;
కోనసీమలో విషాదం నెలకొంది. గోదావరిలో పడి ముగ్గురు మరణించారు. గోదావరి నది స్నానానికి వెళ్లిన ముగ్గురు అందులో మునిగిపోయి మరణించారని స్థానికులు చెబుతున్నారు. కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం బడుగువాని లంకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఈతకు వెళ్లి...
మృతులు ముగ్గురూ ఆలమూరు మండలం చిలకపాలపాడు గ్రామస్థులగా గుర్తించారు. మృతదేహాలను బయటకు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి మృతితో బడుగువాని లంకలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈత రాకపోవడం వల్లనే మరణించినట్లు ప్రాధమికంగా గుర్తించారని తెలిసింది.