దాగుడు మూతలాట.. చిన్నారి మృతి
పన్నెండేళ్ల అభిషేక్ తన చెల్లితో కలసి దాగుడు మూతల ఆట ఆట కు దిగాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూరగాయల సంతకు వెళ్లారు
దాగుడు మూతల దండాకోర్.. పిల్లి వచ్చే... ఎలుకా వచ్చే.. గప్ చిప్ సాంబార్ బుడ్డి.. చిన్న తనంలో ఆడే ఆటలు. బాల్యంలో ప్రతి ఒక్కరికీ ఈ ఆట గురించి తెలుసు. అయితే ఇదే ఆట ఒక ఇంట విషాదంగా మారింది. ఒక బాలుడు మృతి చెందిన సంఘటన కొమురం భీం జిల్లాలో జరిగింది. కొమురంభీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లికి చెందిన అభిషేక్ నాలుగో తరగతి చదువుతున్నాడు.
పత్తి బేళ్లలో...
పన్నెండేళ్ల అభిషేక్ తన చెల్లితో కలసి దాగుడు మూతల ఆట ఆట కు దిగాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూరగాయల సంతకు వెళ్లారు. చెల్లికి కన్పించకుండా ఉండేందుకు పత్తిలో అభిషేక్ దాక్కున్నాడు. సంత నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లలిదండ్రులు అన్న ఏడని చెల్లిని అడగగా తనకు తెలియదని చెప్పింది. దీంతో వెదుకులాడగా పత్తి బేళ్లలో చిక్కుకుని అభిషేక్ ఉన్నాడు. అప్పటికే అభిషేక్ మరణించాడు. అభిషేక్ ఊపిరాడక మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బతుకుతాడన్న ఆశతో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. అప్పటికే అభిషేక్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.