డివైడర్ ను ఢీ కొట్టిన టూ వీలర్.. ఒకరి మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పీవీఎన్ఆర్ 152 పిల్లర్ వద్ద గురువారం ఉదయం ఈ ఘోర ప్రమాదం..;

Update: 2023-07-27 11:10 GMT
rajendranagar pvnr express way

rajendranagar pvnr express way

  • whatsapp icon

భారీ వర్షంలో ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ పై వెళ్తుండగా.. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పీవీఎన్ఆర్ 152 పిల్లర్ వద్ద గురువారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. వర్షం కారణంగా బైక్ స్కిడ్ అవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి, మృతుడిని పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఈ ప్రమాదంతో రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా.. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ వే పై టూ వీలర్స్ కు అనుమతి లేకపోయినా.. పైకి రావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టూ వీలర్స్ ఎక్స్ ప్రెస్ వే పైకి రావొద్దని సూచించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News