అబార్షన్ చేస్తుండగా మరణించిన ప్రియురాలు.. పిల్లలను కూడా నదిలోకి విసిరేశారు

అబార్షన్ సమయంలో మరణించిన తన ప్రియురాలి మృతదేహాన్ని, ఆమె ఇద్దరు పిల్లలను

Update: 2024-07-23 03:12 GMT

అబార్షన్ సమయంలో మరణించిన తన ప్రియురాలి మృతదేహాన్ని, ఆమె ఇద్దరు పిల్లలను నదిలో విసిరేసినందుకు ఒక వ్యక్తి, అతని స్నేహితుడిని పూణేలో అధికారులు అరెస్టు చేశారు. 25 ఏళ్ల గర్భిణి జూలై 9న నవీ ముంబై ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుంటుండగా మృతి చెందింది. ప్రధాన నిందితుడు, ఆ మహిళ ప్రియుడైన గజేంద్ర దగద్‌ఖైరే, అతని స్నేహితుడు రవికాంత్ గైక్వాడ్ సహాయంతో ఆమె మృతదేహాన్ని పూణేలోని తలేగావ్ సమీపంలోని ఇంద్రాయణి నదిలో పారవేశారు. తల్లి మృతదేహాన్ని నీటిలో పడేయడం చూసి 5, 2 ఏళ్ల వయసున్న పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో వారిని కూడా నదిలోకి నెట్టినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రకారం మహిళ తన భర్త నుండి విడిపోయి ఉంటోంది. గజేంద్రతో రిలేషన్ షిప్ లో ఉంది. ఆమె గర్భవతి అయింది. జూలై 8న అమర్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె మరణించింది. అబార్షన్‌లో వారికి సహాయం చేసిన ఏజెంట్ కూడా మృతదేహాన్ని పూణేకు తీసుకెళ్లడంలో పాలుపంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన చాలా రోజుల వరకు గజేంద్ర, రవికాంత్‌లు ఏమీ పట్టనట్లుగా ప్రవర్తించారు. ఇంతలో, మహిళ కుటుంబ సభ్యులు ఆమెను సంప్రదించలేకపోవడంతో పోలీసులకు మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీసుల విచారణలో గజేంద్ర ఆ మహిళకు, అతని స్నేహితుడు రవికాంత్‌కు మధ్య తరచూ ఫోన్‌లో పరిచయం ఉన్నట్లు తేలింది. విచారణలో ఇద్దరూ వేరు వేరు సమాధానాలు ఇచ్చారు. అయితే, చివరకు నేరం అంగీకరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేయగా కోర్టు వారికి జూలై 30 వరకు పోలీసు కస్టడీ విధించింది.

అబార్షన్ చేస్తుండగా మరణించిన ప్రియురాలు.. పిల్లలను కూడా నదిలోకి విసిరేశారు.25 ఏళ్ల గర్భిణి జూలై 9న నవీ ముంబై ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుంటుండగా మృతి చెందింది. ఆ మహిళ ప్రియుడైన గజేంద్ర దగద్‌ఖైరే, అతని స్నేహితుడు రవికాంత్ గైక్వాడ్ సహాయంతో ఆమె మృతదేహాన్ని పూణేలోని తలేగావ్ సమీపంలోని ఇంద్రాయణి నదిలో పారవేశారు.

Tags:    

Similar News