అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. వారిద్దరూ భార్యభర్తలేనా ?

మహారాష్ట్రకు చెందిన దంపతులు ఎర్నాకులంలోని గిరినగర్లో ఏడాదిగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య తరచుగా..

Update: 2022-10-25 13:00 GMT

భార్య గొంతుకోసి హతమార్చి.. ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టిపడేశాడో భర్త. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఎర్నాకులంలో జరిగిన ఈ హత్యపై కడవంత్ర పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. బాధితురాలు మహారాష్ట్రకు చెందిన లక్ష్మిగా గుర్తించారు. భర్త రామ్ బహదూర్ ఆమెను హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దంపతులు ఎర్నాకులంలోని గిరినగర్లో ఏడాదిగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇదంతా భరించలేక ఈ భార్య గొంతుకోసి చంపేశాడు. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఇంట్లో ఉంచాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో.. యజమాని సోమవారం (అక్టోబర్ 24) సాయంత్రం పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి చూడగా.. మహిళ మృతదేహం ప్లాస్టిక్ కవర్లో కుళ్లిన స్థితిలో కనిపించింది. భార్యను హత్యచేసి.. అతను పరారయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇంటి యజమానిని ఈ విషయంపై ఆరా తీయగా.. అద్దెకి వచ్చినపుడు తమ గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలు అడిగినా ఇవ్వలేదని తెలిపాడు. వారిద్దరూ భార్య, భర్తలేనా ? వారి పేర్లైనా నిజమేనా ?అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News