గృహ హింస కేసుల్లో తెలంగాణకు రెండో స్థానం

2021 నాటికి దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు సంబంధించి 21.22 లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్ ఉండగా..;

Update: 2023-03-23 04:17 GMT
women and men in india Survey, House Harassment in india, house harassment cases

house harassment cases

  • whatsapp icon

దేశంలో గృహ హింస కేసులకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 75 శాతం గృహ హింస కేసులతో అసోం ప్రథమ స్థానంగా ఉండగా.. 50.4 శాతం కేసులతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 48.9 శాతం కేసులతో ఢిల్లీ మూడోస్థానంలో ఉంది. గృహహింస కేసుల్లో .. మూడో వంతు కేసులు భర్త, బంధువులు చేస్తున్న దాడులపైనే ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా చేసే దాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటివి ఉన్నాయి. 2015-16లో ఇవి 33.3 శాతం ఉండగా 2019-21 నాటికి 31.9 శాతానికి తగ్గాయి. మళ్లీ మహిళలపై జరుగుతున్న దాడుల సంఖ్య పెరుగుతుండటంపై దేశమంతా ఆందోళన వ్యక్తమవుతోంది.

2021 నాటికి దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు సంబంధించి 21.22 లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్ ఉండగా.. ఇప్పటి వరకూ 83,536 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 21.21 లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి పరిష్కారంపై సత్వరమే వేగం పెంచాలని సర్వే అభిప్రాయపడింది. మహిళలపై జరుగుతున్న దాడులు చాలా వరకూ ఇంట్లోనే జరుగుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది. భర్త, అతడి బంధువుల దాడికి సంబంధించి 2016లో 1,10,378 కేసులు నమోదు కాగా, 2021 నాటికి ఇవి 1,36,234కు పెరిగాయి. 2016తో పోలిస్తే 2021లో అత్యాచార ఘటనలు కొంత తగ్గి 31,677గా నమోదయ్యాయి. కిడ్నాప్ లు, లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు పెరిగాయి. 2005లో 40,998 మంది మహిళలు బలవన్మరణాలకు పాల్పడగా.. 2011 నాటికి ఇది 47,746 కు పెరిగింది. 2021లో 45,026 మహిళల ఆత్మహత్యలు నమోదయ్యాయి.






Tags:    

Similar News