అదనపు కట్న వేధింపులకు వివాహిత బలి

కానీ.. ఎంత కట్నమిచ్చినా వినోద్ కి ధన దాహం తీరలేదు. అదనపు కట్నం కోసం శిరీషను వేధించసాగాడు. వినోద్ తో పాటు..;

Update: 2022-11-14 10:53 GMT
extra dowry harassment, anantapur crime news

extra dowry harassment

  • whatsapp icon

వరుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. మంచి జీతం.. ఇది చాలదా కూతురు సుఖంగా బ్రతకడానికి అనుకున్నారు. తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఏడాది వయసు కొడుకు ఉన్నాడు. కానీ.. వరకట్న భూతం ఆ ఇల్లాలిని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా ఉరవకొండ లోని CVV నగర్‌కు చెందిన వినోద్‌ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. బుక్కరాయసముద్రానికి చెందిన శిరీషతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నంగా 20 తులాల బంగారం, 5 సెంట్ల స్థలం, లక్ష నగదు ఇచ్చారు. ప్రస్తుతం వీరికి ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు.

కానీ.. ఎంత కట్నమిచ్చినా వినోద్ కి ధన దాహం తీరలేదు. అదనపు కట్నం కోసం శిరీషను వేధించసాగాడు. వినోద్ తో పాటు.. అతని తల్లి సుజాత, అక్క భారతి, బావ ధనుంజయ, మేనమామ ప్రకాష్‌ కూడా అదనపు కట్నం తేవాలని వేధించారు. వేధింపులు భరించలేక శిరీష ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త వినోద్ ఆదివారం తెల్లవారుజామున శిరీషను చూసి ఖంగుతున్నాడు. స్థానికుల సహాయంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కూతురు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమ కుమార్తెను ఆమె భర్త, అత్తింటి వారి బంధువులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కూతురి పేరున ఉన్న ఐదు సెంట్ల భూమిని తన పేరు మీద రాయాలని వినోద్ తరచూ వేధించాడంటున్నారు. బాధితురాలి సోదరుడు శివప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News