నేడు మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
వేకువ జాము నుంచి రాత్రి వరకూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచి రాత్రి వరకూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దసరా నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు కనకదుర్గమ్మ తల్లి శ్రీ మహాలక్ష్మి దేవి గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారు గులాబీరంగు చీరకట్టి.. ఆభరణాలు ధరిస్తారు. చక్కెర పొంగలి, క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మహాలక్ష్మీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల రుణబాధలు తీరుతాయని భక్తుల నమ్మిక. ఈరోజు మహాలక్ష్మి అష్టకం పఠిస్తే మంచిదని విశ్వాసం.
శ్రీశైలంలో..
శ్రీశైల దేవస్థానంలో దసరా నవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు భ్రమరాంబ దేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు కాత్యాయని దేవికి హంస వాహన సేవ నిర్వహిస్తారు.