అందరూ తిరిగి వస్తున్నారే…?
ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై దాని మిత్రపక్షాలకు కూడా నమ్మకం లేదు. రాహుల్ సారథ్యంలో వెళ్లేందుకు కొందరు ఇష్టపడక పోవడం ఒక కారణమైతే, కాంగ్రెస్ కోలుకోలేదన్న [more]
ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై దాని మిత్రపక్షాలకు కూడా నమ్మకం లేదు. రాహుల్ సారథ్యంలో వెళ్లేందుకు కొందరు ఇష్టపడక పోవడం ఒక కారణమైతే, కాంగ్రెస్ కోలుకోలేదన్న [more]
ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై దాని మిత్రపక్షాలకు కూడా నమ్మకం లేదు. రాహుల్ సారథ్యంలో వెళ్లేందుకు కొందరు ఇష్టపడక పోవడం ఒక కారణమైతే, కాంగ్రెస్ కోలుకోలేదన్న మరో బలమైన కారణం అని చెప్పాలి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న మిత్రపక్షాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ కు దూరంగా ఉంటూనే ఉన్నాయి. అయితే మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న విధానాలను అన్నింటినీ ఏకతాటిపైకి తెస్తాయంటున్నారు.
అప్పుడు మద్దతిచ్చి…..
యూపీఏ 1, యూపీఏ 2లో భాగస్వామిగా ఉన్న మిత్రపక్షాలు ఇప్పుడు పెద్దగా కలసి రావడం లేదు. డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీలు మినహా ఏ పార్టీ జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు కలసి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ దేశంలో కోలుకుంటుందని నమ్మకం లేకపోవడమే. అంతేకాకుండా రాహుల్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడని నేతలు కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో కలసి నడిచేందుకు ముందుకు రావడం లేదు.
రాష్ట్రాల్లో ప్రత్యర్థి కావడం….
ప్రధానంగా అప్పట్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు కాంగ్రెస్ కు అండగా నిలిచేవి. అయితే రెండోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ పార్టీలు కాంగ్రెస్ ను దూరం పెడుతున్నాయి. ఇందుకు మరో కారణం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటమే. పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తర్ ప్రదేశ్ లలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కు ఆ పార్టీలు దూరంగా ఉంటూ వస్తున్నాయి. రాష్ట్రాన్ని పక్కన పెడితే జాతీయ స్థాయిలో కూడా మోదీ ప్రభుత్వంపై పోరాటానికి కలసి రావడం లేదు.
వ్యవసాయ బిల్లులపై…
అయితే తాజాగా మోదీ ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ సంస్కరణ బిల్లులను వీరందరినీ ఏకం చేసిందంటున్నారు. దేశ వ్యాప్తంగా రైతుల ప్రయోజనాలు ఈ సంస్కరణల ద్వారా దెబ్బతింటాయని భావించి విపక్ష పార్టీలన్నీ ఒక గూటికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. బిల్లులు ఓడిపోయినా రాజ్యసభలో జరిగిన పరిణామాలు విపక్షాలన్నింటినీ త్వరలోనే ఏకతాటిపైకి తెస్తాయని చెబుతున్నారు. సోనియా గాంధీ విదేశాలనుంచి వచ్చిన వెంటనే విపక్షాల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.