అపరమిత అధికారాలేమీ లేవట

అమెరికా రాజ్యాంగం అధ్యక్షులకు అపరిమిత అధికారాలు కల్పించలేదు. ఏకపక్ష అవకాశాలను ఇవ్వలేదు. అధ్యక్ష హోదాలో ఆయన దాదాపు నాలుగువేల మందిని వివిధ హోదాల్లో నియమిస్తారు. వీరిలో కేబినెట్ [more]

Update: 2021-02-24 16:30 GMT

అమెరికా రాజ్యాంగం అధ్యక్షులకు అపరిమిత అధికారాలు కల్పించలేదు. ఏకపక్ష అవకాశాలను ఇవ్వలేదు. అధ్యక్ష హోదాలో ఆయన దాదాపు నాలుగువేల మందిని వివిధ హోదాల్లో నియమిస్తారు. వీరిలో కేబినెట్ మంత్రులు, రాయబారులు, ఉన్నతాధికారులు ఉంటారు. కీలకమైన అనేక నియామకాలకు సంబంధించి సహేతుకమైన పరిమితులను విధించింది. అధ్యక్షుడు మొత్తం నాలుగు రకాల నియామకాలను చేస్తారు. కొన్ని నియామకాలను సెనెట్ (మన దేశంలో రాజ్యసభ వంటిది) ఆమోదంతో, మరికొన్ని సెనెట్ ఆమోదం లేకుండా చేస్తారు. మరికొన్ని తన స్వీయ విచక్షణాధికారంతో చేస్తారు.

వందమంది సభ్యులుగల….

సెనేట్ లో వందమంది సభ్యులుంటారు. మొత్తం అమెరికాలోని 50 రాష్రాలకు గాను ఒక్కో రాష్రానికి ఇద్దరు చొప్పున వంద మంది సభ్యులు ఉంటారు. ఈ సెనెటుకు ఉపాధ్యక్షుడు (కమలా హారిస్) అధ్యక్షత వహిస్తారు. ఏదైనా విషయంలో ఓటింగ్ జరిగి, అధికార, విపక్షాలకు చెరి సమానం ఓట్లు లభించినప్పుడు ఛైర్మన్ హోదాలో ఉపాధ్యక్షుడి ఓటు కీలకమవుతుంది. ప్రస్తుత సెనేట్ లో డెమోక్రట్లకే ఆధిక్యం ఉన్నందువల్ల బైడెన్ నిర్ణయాలకు తిరుగుండదు. అన్నింటికన్నా కేబినెట్ నియామకాలు కీలకమైనవి. ప్రధాన కేబినెట్ లో కేవలం 15 మంది మాత్రమే ఉంటారు. వీరు ఆయా శాఖలకు ముఖ్య కార్యనిర్వహణ శాఖ అధికారుల్లా వ్యవహరిస్తారు. పాలనలో అధ్యక్షుడికి సహాయ సహకారాలు అందజేస్తారు. వీరి నియామకాలకు సెనెట్ ఆమోదం తప్పనిసరి. కీలకమైన రక్షణ, ఆర్థిక, విదేశాంగ, న్యాయశాఖ మంత్రి పదవులకు నియామకాకు సెనెట్ ఆమోదం అనివార్యం. అగ్రరాజ్యంలో మన దేశంలో మాదిరిగా మంత్రులుగా పిలవరు. వారిని సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా వ్యవహరిస్తారు.

న్యాయశాఖ మంత్రినే….

న్యాయశాఖ మంత్రిని అటార్నీ జనరల్ గా పిలుస్తారు. మన దేశంలో అటార్నీజనరల్ పాత్ర వేరు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత మన న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. వ్యవసాయం, వాణిజ్యం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, మానవ సేవలు, అంతర్గత శాంతిభద్రత, గ్రుహ, పట్టణాభివద్ది, కార్మిక, రవాణా, ఆర్థిక, సీనియర్ సిటిజన్ల వ్యవహారాలకు కేబినెట్ మంత్రులుంటారు. వీరి నియామకాలకు సెనెట్ ఆమోదం తప్పనిసరి.వీరు కాకుండా ఫెడరల్ న్యాయమూర్తులు, వివిధ దేశాల్లో అమెరికా తరఫున దౌత్య వ్యవహారాలు నిర్వహించేందుకు రాయబారులు, ఇతర ఉన్నతాధికారులను దేశాధ్యక్షుడు సెనెట్ ఆమోదంతో నియమించుకునే అధికారం ఉంది. కీలకమైన విదేశాంగ, రక్షణ మంత్రులుగా ఆంటోనీ బ్లింకెన్, ఆస్టిన్ లాయిడ్ లను ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలకుసెనెట్ ఆమోదం తెలిపింది.

ఆయనకే సంపూర్ణ అధికారం….

బ్లింకెన్ భారత అనుకూల, చైనా వ్యతిరేక వాది. రక్షణ మంత్రిగా సెనెట్ ఆమోదించిన లాయిడ్ ఆస్టిన్ తొలి నల్ల జాతీయుడు. ఆయన గతంలో సైన్యంలో పని చేయడం విశేషం. అధ్యక్షుల అనుగ్రహం ఉన్నంతకాలమే మంత్రులు పదవుల్లో కొనసాగుతారు. ఆయనకు ఇష్టం లేకపోతే వారిని తొలగించే సంపూర్ణ అధికారం ఉంటుంది. రాజ్యంగంలో కేబినెట్ ను నిర్దిష్టంగా నిర్వచించలేదు. అధ్యక్షుడి విచక్షణ అధికారం మేరకు ఎంతమందినైనా నియమించుకోవచ్చు. అయితే ఈ నియామకాలకు సెనెట్ ఆమోదం తప్పనిసరి. అమెరికాలో జన్మించనివారు, పుట్టుకతో అమెరికా పౌరులు కాని వారు కూడా కేబినెట్ లో చేరవచ్చు. ఇవికాక సీనియర్ ఎగ్జిక్యూటీవ్ సర్వీసెస్, ఇతర రాజకీయ నియామకాలను అధ్యక్షుడు చేసుకోవచ్చు. వీటికి సెనెట్ అనుమతులు అవసరం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News