డగ్లస్ … సెకండ్ జెంటిల్మన్

ప్రపంచంలో రెండో అతిపెద్ద, అతి పురాతన ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన అమెరికాలో అధికారిక మర్యాదలు ఆసక్తికరంగా ఉంటాయి. అక్కడ దేశాధినేతలతో పాటు వారి జీవిత భాగస్వాములకు కూడా [more]

Update: 2020-12-16 16:30 GMT

ప్రపంచంలో రెండో అతిపెద్ద, అతి పురాతన ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన అమెరికాలో అధికారిక మర్యాదలు ఆసక్తికరంగా ఉంటాయి. అక్కడ దేశాధినేతలతో పాటు వారి జీవిత భాగస్వాములకు కూడా రాచ మర్యాదలు లభిస్తాయి. వీరు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తమ భర్తలతో పాటు విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. ఈ సందర్భంగా వీరికి అధ్యక్షుడితో సరిసమానంగా అధికారిక మర్యాదలు లభిస్తాయి. గౌరవాలు పొందుతారు. అగ్రరాజ్యాధినేతను ఫస్ట్ జెంటిల్మెన్ అని సంబోధిస్తారు. ఆయనకు లభించే గౌరవ, మర్యాదలు గురించి చెప్పక్కర్లేదు. అధినేత అర్థాంగిని ‘ఫస్ట్ లేడీ’అని సంబోధిస్తారు. అధ్యక్షుడి స్థాయిలో ఆమెకు అతిథి మర్యాదలు లభిస్తాయి. ఈ విషయాలు దాదాపుగా అందరికీ తెలిసినవే.

సెకండ్ జెంటిల్మన్ గా…..

అమెరికా అధ్యక్షుడి తరవాత ఉపాధ్యక్షుడికి అధికారికంగా ప్రొటోకాల్ ప్రకారం దేశ, విదేశాల్లో ద్వితీయ ప్రాధాన్యం లభిస్తుంది. విందులు, వినోదాలు, విదేశీ పర్యటనల విషయంలో ఆయనకు లేదా ఆమెకు ఎనలేని గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇప్పటివరకు పురుషులే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఒక మహిళ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైంది. భారత-జమైకా మూలాలున్న కమలా హారిస్ రెండో ప్రాధాన్య పదవికి మంచి మెజార్టీతో ఎన్నికయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం ఉపాధ్యక్షుడిని అక్కడ సెకండ్ జెంటిల్మన్ అని వ్యవహరిస్తారు.ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి తొలిసారి మహిళ ఎన్నికైనందున ఏం చేయాలన్న విషయమై తర్జన భర్జనలు జరిగాయి. దీంతో ఉపాధ్యక్షురాలి భర్త అయిన డగ్లస్ కు అధికారికంగా ‘సెక్ండ్ జెంటిల్మన్’ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కమలా హారిస్ భర్త డగ్లస్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిఅయ్యారు. ఆయన పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆయన హోదా గురించి అంతర్జాతీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డగ్లస్ పుట్టుపూర్వోత్తరాల గురించి అంతటా ఆసక్తి నెలకొంది.

ప్రముఖ న్యాయవాదిగా….

56 సంవత్సరాల డగ్లస్ ప్రముఖ న్యాయవాది. న్యూయార్క్ లో జన్మించారు. యూదు సంతతికి చెందినవారు. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోన్యాయ శాస్ర్తం చదివారు. కమలా హారిస్ కూడా న్యాయవాదే. అలా పరిచయమయ్యారు. క్రమంగా అది ప్రేమగా మారింది. కాలక్రమంలో వివాహం ద్వారా 2014 ఆగస్టు 22న ఒక్కటయ్యారు. కమలకు ఇది తొలి వివాహం కాగా డగ్లస్ కు రెండో పెళ్లి. కమల వివాహంలో ఆమె సోదరి మాయా హారిస్, మేనకోడలు మాయా ఏంజెల్ కీలకపాత్ర పోషించారు. కమలకు డగ్లస్ సరైనజోడీ అని ఆమె మేనమామ బాలచంద్రన్ చెబుతుంటారు. మొదటి భార్య కెర్సిన్ నుంచి విడాకులు పొందారు. 1992లో వారి వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జాన్ కొల్డ్రే న్ , కూతురు ఎల్లా ఫిట్జ్ గెలాఫ్ . ఇద్దరూ మేజర్లే.పిల్లలిద్దరూ తండ్రి వద్దే ఉంటారు. తండ్రికి పెళ్లయిన తరువాత వారు కమల వద్దే ఉండటం విశేషం. కమల సవతి తల్లి కాదని, సొంత తల్లి అని వారు చెబుతుంటారు. కమలా కూడా వారు తమ సొంత బిడ్డలేనని చెబుతుంటోంది.

ఇప్పటికీ మాజీ భార్యతో…..

డగ్లస్ డీఎల్ఏ సంస్థలో న్యాయసలహాదారు. కమల ఉపాధ్యక్షప దవికి పోటీ చేయడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మన్ముందు కూడా ఉద్యోగం చేయనని, అదే సమయంలో రాజకీయాల్లోకి కూడా రాబోనని డగ్లస్ స్పష్టం చేశారు. డగ్లస్ మొదటి భార్య కెర్సిన్ తో కమలకు సత్సంబంధాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో కమల విజయానికి ఆమె ప్రచారం చేశారు. డగ్లస్ తన మాజీ భార్యతో ఇప్పటికీ స్నేహపూరితంగా ఉండటం విశేషం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News