హర్ష కుమార్ కుటుంబానికి కరోనా
అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ కుటుంబానికి కరోనా సోకింది. హర్ష కుమార్ భార్య సరళ, ఇద్దరు కోడళ్ళకు, మనవరాలికి వైరస్ సోకినట్లు ఆయన [more]
అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ కుటుంబానికి కరోనా సోకింది. హర్ష కుమార్ భార్య సరళ, ఇద్దరు కోడళ్ళకు, మనవరాలికి వైరస్ సోకినట్లు ఆయన [more]
అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ కుటుంబానికి కరోనా సోకింది. హర్ష కుమార్ భార్య సరళ, ఇద్దరు కోడళ్ళకు, మనవరాలికి వైరస్ సోకినట్లు ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అభిమానులు, ప్రజలు కంగారు పడవొద్దని తమ కుటుంబం కోలుకోవడం కోసం ప్రార్ధించాలని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. హర్షకుమార్ భార్య సరళ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వచ్చిన నాటినుంచి ఏ రోజు సెలవు కూడా తీసుకోకుండా ఆమె బాధ్యతలు నిర్వర్తించడంతో ఇది వచ్చినట్లు హర్షకుమార్ వెల్లడించారు. ముందుగా ఆమెకు తరువాత సెకండరీ కాంటాక్ట్ లు గా పరీక్షలు చేయించుకోగా తమకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
క్షేమంగా తిరిగి వస్తాం …
అయితే తామంతా కోలుకుని క్షేమంగా తిరిగి వస్తామని అంతా ధైర్యంగా ఉండాలని వ్యాఖ్యానించారు ఆయన. అదే విధంగా కొద్ది రోజుల పాటు తమ ఇంటికి ఎవరు రావొద్దని, ఫోన్లు చేయవద్దని కూడా విజ్ఞప్తి చేశారు హర్ష కుమార్. ఇటీవల కొంత కాలంగా హర్ష వైసిపి సర్కార్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తునే దళితుల సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు. దళిత బాలిక అత్యాచారం, దళిత యువకుడి శిరోముండనం, చీరాలలో పోలీసుల లాఠీ దెబ్బకు యువకుడు చనిపోయిన సంఘటనలపై ఉద్యమాలు చేశారు హర్ష. వయస్సు రీత్యా అదే విధంగా గతంలో జరిగిన హత్యాయత్నం కారణంగా హర్ష కుమార్ కి పలు ఆపరేషన్లు చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అత్యుత్తమ మందులు అందుబాటులో ఉన్నందున ఆందోళన చెందొద్దని హర్షకుమార్ మాత్రం అభిమానులకు తన పోస్ట్ ద్వారా విజ్నప్తి చేశారు.