చంద్రబాబు ను కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనా?

ఏపీ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం వైఎస్ [more]

Update: 2021-08-14 09:30 GMT

ఏపీ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం వైఎస్ జగన్ తండ్రి పేరిట ఏర్పాటు చేసిన వైఎస్సార్ పార్టీ తెలుగుదేశం పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టింది.2014 లో రాష్ట్ర విభజన తరువాత ఆ అంశాన్ని అవకాశంగా మలుచుకుని కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి కావాలనే స్లోగన్ తో బాటు జనసేన, బిజెపి లతో పొత్తు, కాంగ్రెస్ ద్రోహం చేసింది అనే నినాదాలు చంద్రబాబు కు బాగా కలిసొచ్చాయి. తండ్రి వైఎస్ఆర్ ఇమేజ్ తో ఎన్నికల్లోకి దిగిన జగన్ గెలుపు ముంగిట బోల్తా పడ్డారు. ముఖ్యమంత్రి పీఠం సమీపం వరకు వచ్చి వైసిపి కి దూరం అయ్యింది.

2019 లో వ్యూహం మార్చిన జగన్ …

కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ పార్టీ వైపు మళ్ళింది. ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దళితులు, మైనారిటీలుగా ఉండేవారు. టిడిపి కి బిసిలు అండగా ఉండేవారు. కాపులు ప్రతీ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా ఆ రెండు పార్టీల గెలుపు ఓటములను నిర్దేశించేవారు. ఇవి ఆ రెండు పార్టీలకు సంప్రదాయ ఓటు బ్యాంక్ లు గా దశాబ్దాలుగా ఉంటూ వచ్చాయి. 2014 ఎన్నికలు నేర్పిన గుణపాఠం తో వైఎస్ జగన్ వ్యూహం మార్చారు విపక్షంలో ఉన్న కాలంలో టిడిపి ఓటు బ్యాంక్ కి బలంగా గురిపెట్టారు. బిసిలకు వైసిపి లో అత్యధిక ప్రాధాన్యాత కల్పించారు జగన్. అదీగాక జనసేన, బిజెపి లు టిడిపి నుంచి విడిపోయి పోటీ చేయడం కూడా బాగా కలిసివచ్చింది వైసిపి కి దాంతో అఖండ మెజారిటీతో సిఎం పీఠం ఎక్కేశారు వైఎస్ తనయుడు.

ఆ ఓటు బ్యాంక్ లాగాలని ప్రయత్నం చేస్తున్నా …

గత ఏడేళ్ళుగా జగన్ ఓటు బ్యాంక్ కి చిల్లు పెట్టాలని టిడిపి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దళితులు, మైనారిటీలకు సంబంధించి ఏ చిన్న వివాదం ఎపి లో ఏర్పడినా టిడిపి దాన్ని తన మీడియా ద్వారా చాలా పెద్దఎత్తునే హైలెట్ చేస్తూ జగన్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. అయినా కానీ ఫలితం ఇవ్వడం లేదు. సంక్షేమ కార్యక్రమాలే అండగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక జరిగిన అన్ని ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ లో మట్టికొట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేయడమే వైసిపి ఓటు బ్యాంక్ ను వీక్ చేసే వ్యూహంగా టిడిపి ముందు ఉన్న అవకాశం. హస్తం బలోపేతమే ప్రస్తుత తరుణంలో ఏపీ లో తమను గట్టున పడవేసి తారక మంత్రం గా పసుపు దళంలో టాక్. అయితే ఆ పార్టీకి ఎంతగాలి కొట్టినా ఏపీ లో కనుచూపు మేరలో కనిపించకుండా జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లోగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఉనికి చాటుకోకపోతే ఆ పార్టీకి లాభం ఉన్నా లేకున్నా టిడిపికి మాత్రం గడ్డుపరిస్థితే అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News