పోలీసులను మెచ్చుకుంటున్నారే
అవును మరి. టీడీపీకి రాత్రీ పగలూ పోలీసుల కలవరింపే ఎక్కువైపోయింది. అధికారం పోయి ఏడు నెలల కాలంలో పసుపు పార్టీ పెద్దలు వైసీపీ నేతలను ఎంతగా తిట్టారో [more]
అవును మరి. టీడీపీకి రాత్రీ పగలూ పోలీసుల కలవరింపే ఎక్కువైపోయింది. అధికారం పోయి ఏడు నెలల కాలంలో పసుపు పార్టీ పెద్దలు వైసీపీ నేతలను ఎంతగా తిట్టారో [more]
అవును మరి. టీడీపీకి రాత్రీ పగలూ పోలీసుల కలవరింపే ఎక్కువైపోయింది. అధికారం పోయి ఏడు నెలల కాలంలో పసుపు పార్టీ పెద్దలు వైసీపీ నేతలను ఎంతగా తిట్టారో అంతకు రెట్టింపు పోలీసులను కూడా ఆడిపోసుకుంటున్నారు. అధినేత చంద్రబాబు నుంచి గల్లీ స్థాయి లీడర్ వరకూ పోలీసుల మీద విరుచుకుపడుతూ పెడబొబ్బలే పెడుతున్నారు. ఆయన ఏకంగా డీజీపీ గౌతం సవాంగ్ కులమేంటి మతమేంటి, ప్రాంతమేంటి అంటూ ఏకరువు పెడుతుంటే ఆయన బాటలోనే తమ్ముళ్ళు కూడా నడుస్తూ ఖాకీలతో సవాల్ అంటున్నారు.
బ్రహ్మాండమట….
ఇక చంద్రబాబు ఓ వైపు పోలీసులను తిడుతూంటే ఆయనకు అచ్చమైన తమ్ముడు అయ్యన్న పాత్రుడు కూడా ఖాకీల మీద తెగ సెటైర్లు వేస్తున్నారు. ఇలా పోలీసుల మీద అయ్యన్న ఎకసెక్కం పీక్స్ కి చేరింది మరి. ఏపీలో పాలన పడకేసిందట. అసలు ఏ ఒక్క విభాగమూ పనిచేయడంలేదుట. కానీ పోలీసులు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారుట. రాత్రీ పగలూ తేడా లేకుండా వారు తమ లాఠీలకు పని చెబుతున్నారుట. ఇదీ మాజీ మంత్రి గారి వ్యంగ్యం. అంటే జగన్ మొత్తం ఎక్కడా పాలన చేయనీయకుండా చేస్తూ పోలీసులతో కధ నడిపిస్తున్నారని, వారితోనే టీడీపీని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి పంచులన్న మాట. పోలీసులను ముందు పెట్టి దౌర్జన్య పాలన జగన్ చేస్తున్నాడంటూ అయ్యన్న హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
టార్గెట్ చేస్తారా…?
ఇక పోలీసులు కూడా ఈ సర్కారే శాశ్వతం అనుకుంటున్నారని అయ్యన్న నోరు చేసుకుంటున్నారు. టీడీపీనే పోలీసులు టార్గెట్ చేస్తున్నారని ఆయన తెగ బాధపడిపోతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ గట్టి హెచ్చరికలే పంపిస్తున్నారు. మేము ఇవాళ ప్రతిపక్షం కావచ్చు కానీ రేపు మేము కూడా మళ్ళీ వస్తామంటూ బెదిరించేలా మాట్లాడుతున్నారు. తాను మూడున్నర దశాబ్దాలుగా పోలీసులను చూస్తున్నానని, తనను ఏమీ చేయలేరని కూడా అయ్యన్న అంటున్నారు.
రివర్స్ కౌంటర్….
అయితే పోలీసులు మాత్రం టీడీపీ నాయకుల భాషను మార్చుకోవాలంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. నిజాయతీతో పనిచేసే నిందలా అంటూ ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత మండిపడుతున్నారు. విజయవాడ కమిషనర్ గా పనిచేసిన గౌతం సవాంగ్ ని నాడు వీరుడు, ధీరుడు అని పొగిడిన చంద్రబాబు ఇపుడు దిగజారి తిట్లదండకం అందుకోవడమేంటని ఆమె నిలదీశారు. మొత్తానికి పోలీసులకు టీడీపీ నాయకుల తిట్లూ, సర్టిఫికేట్లూ రెండూ వద్దని స్వర్ణలత ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. చూడాలి మరి ఈ పోలీస్ టీడీపీ ఆట ఎందాకా వెళ్తుందో.