అయ్యన్నా…. ఇదేందన్నా?

టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి, న‌ర్సీప‌ట్నం మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఇటు పార్టీలోను, అటు బ‌య‌ట కూడా తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం విశాఖ [more]

Update: 2020-02-13 12:30 GMT

టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి, న‌ర్సీప‌ట్నం మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఇటు పార్టీలోను, అటు బ‌య‌ట కూడా తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం విశాఖ రాజ‌ధాని అంశం పార్టీలోను ఉత్త రాంధ్రలోను కూడా తీవ్రమైన చ‌ర్చకు దారితీస్తోంది. ఒక్క వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు త‌ప్ప పార్టీలోనూ ప్రతి ఒక్కరూ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యక్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా అయినా స‌మ‌ర్థిస్తున్నారు. విశాఖను రాజ‌ధానిగా చేస్తానంటే కాద‌నేది ఏముంటుంది.. అయితే, అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయం చేయ‌కూడ‌దంటూ విశాఖ‌కే చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వంటి వారు ప్రక‌టించారు.

మాట మార్చడంతో…..

కానీ, అయ్యన్న పాత్రుడు మాత్ర రోజుకోమాట మారుస్తున్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ది చెందింద‌ని ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేయ‌డానికి ఏమీలేద‌ని కాబ‌ట్టి అమ‌రావ‌తిలోనే రాజ‌దానిని కొన‌సాగించాల‌ని ఆదిలో చెప్పిన ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ మాట మార్చి ఏర్పాటు చేస్తే.. అన్నీ విశాఖ‌లోనే ఏర్పాటు చేయాలంటూ .. కొత్త ప‌ల్లవి అందుకున్నారు. ఇది పార్టీలో సీనియ‌ర్లకు రుచించ‌డం లేదు. అస‌లు ఈ గోలంతా ఎందుకు మౌనంగా ఉంటే స‌రిపోతుంది క‌దా అని అంటున్నారు. ఇదిలావుంటే, వైసీపీకి చెందిన నాయ‌కులు అయ్యన్న పాత్రుడు సెంట‌ర్‌గా విమ‌ర్శలు సంధిస్తున్నారు.

తగదంటూ…..

విశాఖలో పరిపాలనా రాజధాన్ని వ్యతిరేకించడం సరికాదని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. 38 ఏళ్లుగా ప్రజలతో గౌరవం పొందుతూ పదవులు తీసుకున్న అయ్యన్న పాత్రుడు, విశాఖలో రాజధాని ఇస్తున్నందుకు సీఎంను అభినందిస్తారని ఆశించానని చెప్పారు. అందుకు విరుద్ధంగా సభ్యత లేని భాషతో విమర్శించడం ఆయనకు తగదన్నారు. 42 కిలోమీటర్ల దూరం వరకు చంద్రబాబు ప్రభుత్వం మెట్రో రైలుకు ప్రతిపాదించగా, సీఎం జగన్‌ 80 కిలోమీటర్లకు ప్రతి పాదిస్తూ నివేదికలు తయారు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

ఓటు బ్యాంకును…

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు అయ్యన్న పాత్రుడుకు ఇక రాజ‌కీయ స‌న్యాస‌మే మిగిలి ఉంటుంద‌ని అంటున్నారు. ఇప్పటికే న‌ర్సీప‌ట్నంలో ముత్యాల పాప వ‌ర్గం ఆయ‌న‌కు వ్యతిరేకంగా మ‌ళ్లీ పావులు క‌దుపుతోంది. త్వర‌లోనే పాప వ‌ర్గం వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయింది. మ‌రోప‌క్క, టీడీపీ త‌ర‌పున గెలిచిన గ‌ణ‌బాబు వంటి వారు కూడా వైసీపీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీని కాపాడాల‌నే త‌పన‌తో ఉన్న అయ్యన్న పాత్రుడు త‌న ఓటు బ్యాంకును దూరం చేసుకుంటున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కుమారుడితో తలపోటు…..

త‌న సొంత త‌మ్ముడు కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉంటున్న విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోయి.. త‌న కుమారుడి భ‌విత‌ను కూడా కూల‌దోసుకుంటున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఆయ‌న కుమారుడు విజ‌య్ తీరుతో ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కేడ‌ర్ విసిగిపోయి ఉంది. ఇప్పట‌కి అయినా విజ‌య్ తీరు మార‌క‌పోవ‌డంతో పార్టీలో చాలా మంది వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. మ‌రి అయ్యన్న పాత్రుడు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News