రావణుడు ఎవరు ? విభీషణుడు ఎవరు?
ఇంటి గుట్టు లంకకు చేటు. ఈ సామెత రామాయణం నుంచి పుట్టింది అన్నది అందరికి తెలిసిందే. రావణుడు అంతం కావడంలో ఆయన తమ్ముడు విభీషణుడి పాత్ర అందరికి [more]
ఇంటి గుట్టు లంకకు చేటు. ఈ సామెత రామాయణం నుంచి పుట్టింది అన్నది అందరికి తెలిసిందే. రావణుడు అంతం కావడంలో ఆయన తమ్ముడు విభీషణుడి పాత్ర అందరికి [more]
ఇంటి గుట్టు లంకకు చేటు. ఈ సామెత రామాయణం నుంచి పుట్టింది అన్నది అందరికి తెలిసిందే. రావణుడు అంతం కావడంలో ఆయన తమ్ముడు విభీషణుడి పాత్ర అందరికి తెలిసిందే. ధర్మం వైపే విభీషణుడు నిలబడటంతో ఆయన కీర్తి అజరామరం అయ్యింది. అధర్మం వైపు నిలిచిన రావణుడు రాముడి చేతిలో కుక్క చావు చచ్చాడు. ఇది బ్రీఫ్ గా రామాయణం. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా నర్సీపట్నం లో తాజాగా ఇద్దరు అన్నదమ్ముల నడుమ తూర్పు రామాయణం మొదలై ఉత్కంఠ రేపుతోంది. వీరిలో ఒకరు మాజీ మంత్రి టిడిపి ఫైర్ బ్రాండ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. మరొకరు ఆయన సోదరుడు వైసిపి నేత చింతకాయల సన్యాసినాయుడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు రావణుడు ఎవరు విభీషణుడు అనే రీతిలో యుద్ధం సాగుతుంది.
ఎక్కడన్నా తమ్ముడైన రాజకీయాల్లోకాదు …
అయ్యన్న పాత్రుడు, సన్యాసినాయుడు ల నడుమ ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వైరం నడుస్తుంది. ఒకరు అధికార పార్టీలో మరొకరు ప్రధాన విపక్షంలో కీలక పాత్రధారులు. దాంతో ఒకరిపై మరొకరు విరుచుకుపడుతూ ఉండటం విశాఖ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఇదిలావుంటే నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ ప్రభుత్వ వ్యతిరేక చర్యల అభియోగాలపై సర్కార్ సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైద్యుల మనోస్థైర్యం దెబ్బతినేలా ఆయన వ్యాఖ్యలు చేయడం వెనుక మాజీ మంత్రి అయ్యన్న హస్తం ఉందంటూ కొన్ని ఆధారాలను బయటపెట్టింది సర్కార్. అయ్యన్న ఇంట్లో సమావేశం తరువాతే కథ మొత్తం నడిచిందన్నది వీడియో లో చూపించింది. దాంతో ఈ వ్యవహారం టిడిపి కి బూమ్ రాంగ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తెరపైకి వచ్చారు. ఒక సవాల్ విసిరారు. వైద్యుడు సుధాకర్ తనతో సమావేశం జరిపినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం అని వ్యాఖ్యానించడం సంచలనం సృష్ట్టించింది.
సీన్ లోకి దిగిన సన్యాసి నాయుడు …
అయ్యన్నపాత్రుడు ఇలా ప్రకటించారో లేదో వెంటనే ఆయన సోదరుడు వైసిపి నేత చింతకాయల సన్యాసినాయుడు తెరపైకి వచ్చారు. వైద్యుడు తన అన్న ఇంట్లోకి వెళ్లిన వీడియో బయటకు తెచ్చి ఎమ్యెల్యే గణేష్ కి పంపింది తానే అంటూ బాంబు పేల్చారు. డాక్టర్ సుధాకర్, అయ్యన్న ఇద్దరు ఇంటిముందే గంటకు పైగా సమావేశం అయ్యారన్నారు. ఇలా అయ్యన్న సృష్ట్టించిన తుఫాన్ ను ఒక్కచేత్తో తుడిచేశారు. ఎవరో ఈ ఆరోపణలు చేసి ఉంటే రాజకీయాల్లో కొట్టుకుపోయేవి. స్వయంగా అయ్యన్న సోదరుడే ఈ వ్యాఖ్యలు చేయడంతో వైద్యుడు సస్పెన్షన్ వ్యవహారం లో రాజకీయ దుమారం రేపుదామనుకున్న టిడిపి కి అన్ని దారులు మూసుకుపోయాయి. దాంతో ఈ అంశానికి పెద్దగా జనం కూడా ప్రాధాన్యత ఇవ్వడం మానేశారు. క్లిష్టమైన కీలకమైన ఈ సమయంలో ఈ చెత్త రాజకీయాలు ఏమిటి అన్న చర్చ మొదలైంది.