ఊహించిందే అయినా….?
అయ్యన్న పాత్రుడు కుటుంబంలో విభేదాలు ఈనాటివి కావు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆ కుటుంబంలో మనస్పర్థలు రేగాయి. ఇందుకు కారణం అయ్యన్న పాత్రుడు తన కుమారుడు [more]
అయ్యన్న పాత్రుడు కుటుంబంలో విభేదాలు ఈనాటివి కావు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆ కుటుంబంలో మనస్పర్థలు రేగాయి. ఇందుకు కారణం అయ్యన్న పాత్రుడు తన కుమారుడు [more]
అయ్యన్న పాత్రుడు కుటుంబంలో విభేదాలు ఈనాటివి కావు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆ కుటుంబంలో మనస్పర్థలు రేగాయి. ఇందుకు కారణం అయ్యన్న పాత్రుడు తన కుమారుడు విజయ్ పాత్రుడిని ప్రోత్సహిస్తుండటమే. అన్న తర్వాత రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలనుకున్న సన్యాసిపాత్రుడు అది కుదరదని గ్రహించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇది అయ్యన్న పాత్రుడు ఊహించని విషయమేమీ కాదు. సోదరుడి కుమారుడిపై వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు లేఖ ద్వారా తెలియజెప్పి సన్యాసి పాత్రుడు సంచలనం సృష్టించారు.
ఎన్నికలకు ముందే….
నిజానికి సన్యాసి పాత్రుడు ఎన్నికలకు ముందే వైసీపీలో చేరాలని భావించారు. ఈమేరకు చర్చలు కూడా జరిపారు. అయితే నర్సీపట్నం టిక్కెట్ తనకు కావాలని అడగటం..జగన్ నో చెప్పడంతో అప్పట్లో సన్యాసి పాత్రుడు వైసీపీలో ఎంట్రీ ఆగిపోయిందంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు గెలుపు కోసం కూడా కృషి చేసిన సన్యాసి పాత్రుడు ఆతర్వాత అన్నకు దూరంగా ఉంటున్నారు. ఇది ఫక్తు కుటుంబంలో నెలకొన్న విబేదాలేనని చెప్పకతప్పదు. అయ్యన్న పాత్రుడు రాజకీయ విజయాల వెనక సన్యాసి పాత్రుడు కృషి ఎంతో ఉంది.
విజయ్ రాకతో….
అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు ఎదిగి రానంత వరకూ సన్యాసిపాత్రుడే అన్నీ దగ్గరుండి చూసుకునే వారు. అయ్యన్న పాత్రుడు కూడా ఎక్కవగా సోదరుడిపైనే ఆధారపడే వారు. నర్సీపట్నం టీడీపీ కార్యకర్తలుకూడా అయ్యన్నపాత్రుడు కంటే సన్యాసి పాత్రుడి వద్దకే ఎక్కువగా పనుల కోసం వస్తుంటారు. పైగా మున్సిపల్ ఛైర్మన్ కూడా కావడంతో సన్యాసి పాత్రుడు పార్టీలోనే తనకంటూ ఒక వర్గాన్ని అన్నకు సమానంగా ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్తులో అయ్యన్న తర్వాత నర్సీపట్నం తనదేనని సన్యాసి పాత్రుడు భావించడమే ఇందుకు కారణం.
పంచాయతీ నడిచినా….
కానీ విజయ్ పాత్రుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత సన్యాసి పాత్రుడు మాట చెల్లకుండా పోయింది. పలుమార్లు సోదరుడు అయ్యన్న పాత్రుడి వద్ద ఈ పంచాయతీ నడిచింది. అయితే అయ్యన్న సహజంగానే కుమారుడి వైపు మొగ్గు చూపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతోనే సన్యాసి పాత్రుడు టీడీపీకి రాజీనామా చేసి తన దారి తాను చూసుకుంటున్నారు అన్న విజయాల కోసం తాను సంవత్సరాల తరబడి పనిచేసినా తనను కరివేపాకులా వాడుకున్నారని సన్యాసి పాత్రుడు ఆవేదన చెందారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సోదరుడు పార్టీ మారుతున్నారని తెలిసినా అయ్యన్న పాత్రుడు ఎలాంటి బుజ్జగింపులు చేయకపోవడమే.