ప్రియమైన శత్రువు ఎవరంటే
ఏపీ విషయంలో మోడీ ఆలోచనలు ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు. ఇక్కడ ఓ వైపు బీజేపీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. మరో వైపు జగన్ తో దోసీ [more]
ఏపీ విషయంలో మోడీ ఆలోచనలు ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు. ఇక్కడ ఓ వైపు బీజేపీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. మరో వైపు జగన్ తో దోసీ [more]
ఏపీ విషయంలో మోడీ ఆలోచనలు ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు. ఇక్కడ ఓ వైపు బీజేపీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. మరో వైపు జగన్ తో దోసీ కడుతున్నారు. ఇక ఏపీలో టీడీపీ, వైసీపీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి టీడీపీని బలహీనం చేయాలన్నది కమలనాధుల ఎత్తుగడగా ఉంది. అయితే వైసీపీ విషయంలో మాత్రం ఆ పార్టీలో ఇంకా సరైన క్లారిటీ లేదన్న మాట వినిపిస్తోంది. ఏపీలో జగన్ కొత్తగా అధికారంలోకి వచ్చారు. అలా ఇలా కాదు. యాభై శాతం పైగా ఓట్లను సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ విజయం అంత ఆషామాషీ కాదు, జగన్ పాలన గురించి తెలియాలన్నా, జనంలో ఆయన పట్ల అభిప్రాయం మారాలన్నా దానికి చాలా సమయం పడుతుంది. ఆ ప్రజా వ్యతిరేకతను చంద్రబాబు దాన్ని సొమ్ము చేసుకోకుండా చేయడమే ఇపుడు బీజేపీ ముందున్న టార్గెట్.
బాబు విషయంలో ఎలా…..
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో బీజేపీలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. చంద్రబాబుని అలా పక్కన ఉంచి పని కానీయాలని ఓ వర్గం భావిస్తూంటే బాబు అవినీతి కధలు బయటపెట్టి ఆయన్ని జైలు పాలు చేయాలని మరో వర్గం చూస్తోంది. ఇక మోడీ, అమిత్ షాల వ్యూహం ఎలా ఉంటుందన్నది కూడా అంతు చిక్కడంలేదు. బాబు, జగన్ ఈ ఇద్దరిలో ఎవరు శత్రువు అంటే చంద్రబాబేనని మోడీ షా ద్వయం ఠక్కున చెబుతుంది. మోడీని మూడు చెరువుల నీళ్ళు తాగించిన బాబుని వదిలే ప్రసేక్తే లేదని అంటున్నారు. అదృష్టం బాగుండి బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ లేకపోతే బాబు కూటమి వ్యూహాలతో మోడీనే బోనులో పెట్టేవారన్న ఆలోచనలే ఇపుడు అగ్ర నాయకులను నిద్రపోనీయడం లేదంటున్నారు. అందుకే బీజేపీతో బాబు తెరవెనక రాయబేరాలు పెద్దగా ఫలితం ఇవ్వడంలేదని అంటున్నారు.
ఆయన పైనే గురి….
ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన మరోసారి అంటే 2024లో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినా పరవాలేదు. అప్పటికి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి 2029 నాటికి ఏపీ కొల్లగొట్టాలన్నది మోడీ, షా ఎత్తుగడగా కనిపిస్తోంది. అందువల్ల జగన్ ను బలహీన పరచే ఏ చర్యలకూ సిధ్ధపడకూడదని కూడా వారిద్దరూ గట్టిగా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ రాజకీయంగా వెనక్కు తగ్గితే అది కచ్చితంగా బాబుకే అడ్వాంటేజ్ అవుతుందని కూడా వారు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఇపుడున్న పరిస్థితుల్లో బాబు, జగన్లల్లో ముందు బాబే బిగ్ టార్గెట్ అంటున్నారు. ఈ కారణంగానే టీడీపీని మొత్తం ఛిద్రం చేసి బాబును శంకరగిరి మాన్యాలు పట్టించాలన్నది మోడీ షా గేమ్ ప్లాన్ గా ఉందిట. ఈ విధంగా కనుక చూసుకుంటే ఏపీలో మోడీకి ప్రియమైన శత్రువు చంద్రబాబేనని అంటున్నారు.