గోదావరి మింగేసింది ఇలా

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు లో జరిగిన పర్యాటక బోట్ గోదావరిలో మునిగిన సంఘటనలో వివరాలు ఇలా వున్నాయి. బోటు ప్రమాదానికి ముందు అందులో ప్రయాణికులు, [more]

Update: 2019-09-16 02:00 GMT

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు లో జరిగిన పర్యాటక బోట్ గోదావరిలో మునిగిన సంఘటనలో వివరాలు ఇలా వున్నాయి. బోటు ప్రమాదానికి ముందు అందులో ప్రయాణికులు, బోట్ సిబ్బంది కలిసి 72 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 24 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు గల్లంతు అయిన వారు 42 మందిగా అధికారులు నిర్ధారించారు. గోదావరిలో గల్లంతు అయిన వారిలో 8 మంది మృత దేహాలు లభించాయి. గాయపడిన వారికి దేవీపట్నం, రంపచోడవరం ఆసుపత్రుల్లో చికిత్స అందజేస్తున్నారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద స్థలికి ముఖ్యమంత్రి జగన్ …

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే బోటు ప్రమాదం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించడంతో బాటు బాధితులకు పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ సర్కార్ కూడా ఈ ప్రమాదం పై తమ దిగ్బ్రాంతి ని వ్యక్తం చేసి మృతుల్లో తమ రాష్ట్ర వాసులు అత్యధికంగా ఉండటంతో ఐదు లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ప్రభుత్వం పక్షాన సహాయం కోసం మంత్రి పువ్వాడ అజయ్ ను రాజమండ్రికి వెళ్ళలని ఇప్పటికే కెసిఆర్ ఆదేశించారు. ఇక ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎపి గవర్నర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు జగన్ . ఇక తాను స్వయంగా ప్రమాద స్థలిని సందర్శించడంతో బాటు మృతుల బంధువులను ఓదార్చేందుకు రాజమండ్రి చేరుకోనున్నారు. సంఘటనపై రాజమండ్రిలోనే సమీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే జగన్ ఆదేశాలు జారీచేశారు.

చంద్రబాబు ఆదేశాలు …

గోదావరి లో బోటు ప్రమాదంపై చంద్రబాబు తన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం బాధితులను కలవాలని, మృతుల బంధువులను ఓదార్చాలని ఒక బృందాన్ని పార్టీ తరపున వెళ్లాలని ఆదేశించారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపింది టిడిపి. ఇదిలా ఉంటే గల్లంతు అయినవారికోసం ఇప్పటికే ఎన్డీఆర్ ఎఫ్ బృందం, పనిచేస్తుంది. ఓఎన్జీసీ ప్రత్యేక హెలికాఫ్టర్ గాలింపు చేపట్టింది. విశాఖ నుంచి నేవి కి చెందిన టీం అత్యాధునిక గాలింపు పరికరాలతో సోమవారం తన పని మొదలు పెట్టనుంది. వరద ఉదృతి దృష్ట్యా ఆదివారం రాత్రి చీకటి పడగానే గాలింపు చర్యలను అధికారులు నిలుపు చేశారు

Tags:    

Similar News