సత్తిబాబును కంట్రోల్ చేశారా?
సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ నోరు విప్పితే మాటల తూటాలు పేలుతుంటాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు వైసీపీలో ఉన్నా, ఆయన ధోరణి ఒక్కటే. [more]
సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ నోరు విప్పితే మాటల తూటాలు పేలుతుంటాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు వైసీపీలో ఉన్నా, ఆయన ధోరణి ఒక్కటే. [more]
సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ నోరు విప్పితే మాటల తూటాలు పేలుతుంటాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నా, ఇప్పుడు వైసీపీలో ఉన్నా, ఆయన ధోరణి ఒక్కటే. రాజధాని అమరావతిపై మాటల తూటాలు పేల్చి ప్రభుత్వ వ్యూహానికి లైన్ క్లియర్ చేసింది ఆయనే. అంతేకాదు, ప్రభుత్వం ఏం చేయాలని అనుకున్నా ముందు సర్కారీ వ్యూహాన్ని వెల్లడించేది బొత్స సత్యనారాయణ కావడం గమనార్హం. అలాంటి నాయకుడు.. నిత్యం మీడియా ముందుకు వచ్చి పూర్తిస్థాయిలో హల్‌చల్ చేసేవారు. అదేవిధంగా ప్రభుత్వం వ్యతిరేక మీడియాపై కూడా విమర్శలు గుప్పించేవారు.
తగ్గింది అందుకేనా?
రాజధాని విషయంలో ఆయన చేసిన కామెంట్లకు ప్రతిపక్షాలు కౌంటర్లకు వెతుక్కోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అలాంటి నాయకుడు ఇటీవల కాలంలో మౌనం వహిస్తున్నారు. మునుపటి దూకుడును ప్రదర్శించలేక పోతున్నారు. మీడియా ముందుకు వచ్చినా ఆయన కేవలం కొన్ని విషయాలకే పరిమితం అవుతున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ విషయంలో ఏదో జరిగిందనే భావన బలపడుతోంది. కొన్ని రోజుల కిందట మంత్రి కొడాలి నానికి, బొత్సకు రైస్ మిల్లర్ల విషయంలో తేడా వచ్చిందనే విషయం ప్రచారంలో ఉంది.
తీవ్ర వత్తిడితోనే….
తమ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లకు డబ్బులు సకాలంలో చెల్లించడం లేదని, రైస్ కూడా కొనుగోలు చేయడం లేదని బొత్స సత్యనారాయణ మంత్రిని ప్రశ్నించారు. తాము చెప్పిన రేటుకే రైస్ కొనుగోలు చేయాలని కూడా బొత్స కొడాలితో వాదనకు దిగినట్టు టాక్..? దీనికి మంత్రి నాని నేరుగా సమాధానం చెప్పకుండా ఆ విషయం నేను చూసుకుంటాను.. అంటూ చెప్ప డంతోపాటు విషయం సీఎం జగన్ వద్దకు కూడా చేరడంతో బొత్స సత్యనారాయణ ఈ విషయంలో జిల్లాలో రైస్ మిల్లర్ల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
జిల్లా రాజకీయం అంతా….
నిజానికి జిల్లాలోని రైస్ మిల్లుల్లో చాలా వరకు బొత్స బంధువులు, అనుచరులు, కాంగ్రెస్ నేతలవే ఉండడంతో రాజకీయంగా వారు బొత్స సత్యనారాయణకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక బొత్స ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఇదిలావుంటే, సీనియర్ మంత్రిగా తనకు కేబినెట్‌లో ఆశించిన మర్యాద లభించడం లేదనే వేదన కూడా బొత్సలో ఉందని అంటున్నారు. వైఎస్ హయాంలో బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయం అంతా ఆయన కనుసైగల్లోనే నడిచేది.
కంట్రోల్ చేస్తుండటంతో…
ఇప్పుడు జగన్ మాత్రం ఈ విషయంలో బొత్స సత్యనారాయణను ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు. జిల్లాలో చీమ చిటుక్కుమన్నా జగన్‌కు తెలిసిపోతోంది. దీంతో బొత్స సత్యనారాయణ దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక జిల్లాలో ఉన్న పార్టీ నేతలతోనూ ఆయనకు సఖ్యత లేదు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడికల రాజన్నదొర లాంటి సీనియర్లతో బొత్సకు సఖ్యత లేదు. ఈ విషయంలో కూడా జగన్ బొత్సకు సుతిమెత్తంగా వార్నింగ్ ఇవ్వడం కూడా ఆయనకు నచ్చడం లేదట. ఏదేమైనా ఈ పరిణామాలతో నే బొత్స సత్యనారాయణ సైలెంట్ అయ్యారని అంటున్నారు.