బొత్స చూపు ఇక అక్కడేనట….కారణం అదేనట
బొత్స సత్యనారాయణ తాను ఉత్తరాంధ్ర స్థాయి నాయకుడిని అని చెప్పుకుంటారు. ఆ మాటకు వస్తే పీసీసీ ప్రెసిడెంట్ గా తాను విభజన ఏపీలో కీలక నేతను అని [more]
బొత్స సత్యనారాయణ తాను ఉత్తరాంధ్ర స్థాయి నాయకుడిని అని చెప్పుకుంటారు. ఆ మాటకు వస్తే పీసీసీ ప్రెసిడెంట్ గా తాను విభజన ఏపీలో కీలక నేతను అని [more]
బొత్స సత్యనారాయణ తాను ఉత్తరాంధ్ర స్థాయి నాయకుడిని అని చెప్పుకుంటారు. ఆ మాటకు వస్తే పీసీసీ ప్రెసిడెంట్ గా తాను విభజన ఏపీలో కీలక నేతను అని కూడా భావిస్తారు. ఆయనకు జగన్ అతి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. అయితే ఆయన తాను విజయనగరం జిల్లాలో మొత్తానికి మొత్తం వైసీపీకి సీట్లు గెలిపించిన నేతగా ఇంతకు మించి కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వరకైనా తన చేతుల్లో పెడితే పార్టీలో తాను మరింత దూసుకుపోతానని బొత్స సత్యనారాయణ అంటున్నారు. అయితే ఆ బాధ్యతలు విజయసాయిరెడ్డికి జగన్ అప్పగించారు. ఈ నేపధ్యంలో బొత్స సత్యనారాయణ బీసీ నేతగా, కాపు నాయకుడిగా సామాజికవర్గ సమీకరణను పూర్తిగా నమ్ముకుంటున్నారు.
అలా ముందుకు…..
బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి మంత్రిగా ఉండడం వల్ల ఆయనకు మూడు జిల్లాల్లోని నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు వైసీపీలో చేరడంతో బొత్సతో వారు టచ్ లో ఉంటున్నారు. దీన్ని సానుకూలంగా చేసుకుని బొత్స సత్యనారాయణ తన పట్టును పెంచుకోవాలనుకుంటున్నారు. బొత్సకు విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలలో గుడివాడ అమరనాధ్, కరణం ధర్మశ్రీ వంటి వారితో శిష్య బంధం ఉంది. ఈ నేపధ్యంలో తరచుగా బొత్స విశాఖలోనే మీడియా మీటింగులు పెడుతూంటారు. ఇక బొత్సకు విశాఖలోనూ నివాసాలతో పాటు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. దాంతో విశాఖ రాజకీయాల్లో తన హవా చూపించాలని బొత్స ఆలోచిస్తున్నారని అంటున్నారు.
అందుకేనా…?
ఇక విశాఖ రాజధాని అవుతోంది. దాంతో నగర రాజకీయం కూడా వేగంగా మారుతుంది. రాజధాని ఉన్న చోట నేతలకు పలుకుబడి ఒక రేంజిలో ఉంటుంది. ఈ క్రమంలో విశాఖ రాజకీయాన్ని ఒడిసిపట్టాని బొత్స సత్యనారాయణ వ్యూహ రచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ తన శిష్యుడు గుడివాడ అమరనాధ్ అయినా, లేక అనుచరుడు కరణం ధర్మశ్రీ అయినా మంత్రి కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆ దిశగా వారికి మద్దతు కూడా ఇస్తున్నారు, ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ తమ సామాజికవర్గం అయినా ఆయన కంటే కూడా గుడివాడ బెటర్ అని బొత్స ఆలోచనట.
ఎంపీ సీటుకై ….
ఇక మరో నాలుగేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల మీద కూడా బొత్స సత్యనారాయణ కన్ను పడిందని అంటున్నారు. ఆ ఎన్నికల్లో తన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీరాణిని విశాఖ నుంచి ఎంపీగా వైసీపీ తరఫున బరిలోకి దింపాలని కూడా పధకం వేస్తున్నారని అంటున్నారు. అలా విజయనగరం జిల్లా రాజకీయాలతో పాటు, విశాఖలో కూడా చక్రం తిప్పేందుకు వీలుగా ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారుట. ఇక తన భార్య ఎంపీ అయితే అంతా అనుకూలం అవుతుంది అని బొత్స భావిస్తున్నారుట. మొత్తం మీద బొత్స చూపు ఇపుడు ఎంపీ సీటు మీద పడిందని చెబుతున్నారు. మరోమారు ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు టికెట్ రాదని, లోకల్ కార్డుతో, సామాజిక సమీకరణలతో ఆ సీట్లో తన భార్యని పెట్టి గెలిపించుకోవాలన్నది బొత్స ఎత్తుగడగా ఉందిట. చూడాలి మరి.