బౌండరీ దాటని బొత్స

వైసీపీలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. సీనియర్ నేతగా ఆయనకు ముఖ్యమంత్రిగా జగన్ గౌరవమూ ఇస్తారు. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి జగన్ ఇమేజ్ [more]

Update: 2019-10-21 02:00 GMT

వైసీపీలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. సీనియర్ నేతగా ఆయనకు ముఖ్యమంత్రిగా జగన్ గౌరవమూ ఇస్తారు. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి జగన్ ఇమేజ్ తో పాటు బొత్స సత్యనారాయణ శ్రమ కూడా కారణం అన్నది అందరికీ తెలిసిందే. రాజులనే మట్టి కరిపించి బొత్స సత్యనారాయణ పార్టీకి ఫుల్ జోష్ తెచ్చారు. తనకు తిరుగులేదని బొత్స సత్యనారాయణ నిరూపించుకున్నారు. అనుకున్నట్లుగా జగన్ తొలివిడతోనే బొత్స సత్యనారాయణకు కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చారు. అత్యంత ప్రధానమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. సీఆర్డీఏ బాధ్యతలను కూడా బొత్స సత్యనారాయణ చూస్తున్నారు.

హర్ట్ అయ్యారట…..

అయితే బొత్స సత్యనారాయణ ఒక విషయంలో మాత్రం హర్ట్ అవుతున్నారట. ప్రొటోకాల్ విషయంలో బొత్స సత్యనారాయణ తీవ్రంగా మధనపడుతున్నారట. తాను సీనియర్ మంత్రి అయినా బొత్స సత్యనారాయణ జిల్లాకు వస్తే ఒకరకంగా, తనకంటే జూనియర్ అయిన డిప్యూడీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి వస్తే మరొకరకంగా ఉండటంతో బొత్స సత్యనారాయణ వేదన పడుతున్నారట. తన సీనియారిటీకి తగ్గట్లుగా ప్రొటోకాల్ లేదని ఆవేదన చెందుతున్నారు. జగన్ తనను ఇబ్బంది పెట్టడానికే పాముల పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా? అన్న అనుమానం కూడా లేకపోలేదట.

రెండు నియోజకవర్గాలకే….

అందుకే బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకు వచ్చినా కేవలం రెండు నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారట. విజయనగరం, చీపురుపల్లి నియోజకవర్గాల్లోనే ఎక్కువగా తిరుగుతున్నారు. జిల్లాకు వచ్చి సమీక్షలు చేసినా, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ బొత్స సత్యనారాయణ విజయనగరం డివిజన్ దాటి వెళ్లడం లేదు. దీంతో ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ వద్దకు వచ్చి తమ ప్రాంతానికి రావాలని కోరుతున్నా కుదరదులే అని చెప్పి పంపుతున్నారట.

డిప్యూటీ సీఎం కూడా….

మరోవైపు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి సయితం పార్వతీపురం డివిజన్ కే పరిమితమయ్యారు. ఆమె ఎక్కువగా కురుపాం నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఇతర నియోజకవర్గాల్లో తిరిగితే బొత్స సత్యనారాయణకు ఎక్కడ కోపం వస్తుందోనని ఆమె భయపడిపోతున్నారట. డిప్యూటీ సీఎం అవగానే అధికారులు ఆమె కోసం విజయనగరంలో జడ్పీ గెస్ట్ హౌస్ ను క్యాంప్ కార్యాలయంగా మార్చారు. అయితే ఈ క్యాంప్ కార్యాలయంలో కూడా ఆమె ఉండేది అతి తక్కువేనట. ఇలా బొత్స సత్యనారాయణ విజయనగరం డివిజన్ కు పరిమితం కాగా, డిప్యూటీసీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి పార్వతీపురం డివిజన్ కే పరిమితమయ్యారు. ప్రొటోకాల్ భయమే వీరు బౌండరీలు గీసుకోవడానికి కారణమని తెలుస్తోంది.

Tags:    

Similar News