సత్తిబాబును తత్తరపాటు వదిలేట్లు లేదే?
ఈ మాట అంటోంది.. ఎవరో కాదు.. మంత్రి సన్నిహితులు, మిత్రులు, బంధువులే..! మా నాయకుడు ఏం మాట్లాడినా వివాదమే.. అంత సీనియార్టీ ఉండి కూడా ఆయన ఏమీ [more]
ఈ మాట అంటోంది.. ఎవరో కాదు.. మంత్రి సన్నిహితులు, మిత్రులు, బంధువులే..! మా నాయకుడు ఏం మాట్లాడినా వివాదమే.. అంత సీనియార్టీ ఉండి కూడా ఆయన ఏమీ [more]
ఈ మాట అంటోంది.. ఎవరో కాదు.. మంత్రి సన్నిహితులు, మిత్రులు, బంధువులే..! మా నాయకుడు ఏం మాట్లాడినా వివాదమే.. అంత సీనియార్టీ ఉండి కూడా ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. ఆయన మంచోడే అయినా.. నోట్లో శని ఉందా ఏమో..! అని అందరూ అనేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు ? అనేగా సందేహం.. ఆయనెవరో కాదు.. జగన్ కేబినెట్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ. కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఆయన రాజకీయాల్లో మంచి దూకుడు ప్రదర్శించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక, జగన్ కేబినెట్ లో ఆయన మంచి పోర్ట్ ఫోలియో కొట్టేశారు.
సీనియారిటీయే ఇబ్బంది….
దీంతో జగన్ కూడా సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయన సీనియార్టీనే ఆయనకు ఇబ్బందిగా మారింది. ఇటీవల కాలంలో ఆయన రాజధానిపై చేసిన వ్యాఖ్యలు, రైతులపై చేసిన కామెంట్లను మీడియా మంచి వనరుగా మార్చుకుంది. ఆయన ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా.. మీడియాకు ఆయన బాగా దొరికి పోతున్నారనే వాదన వినిపిస్తోంది. బొత్స సత్యనారాయణ మాట్లాడేది ఆయనకే అర్ధం కాదనే వాదన ఉంది. దీనికితోడు.. అర్ధం లేదని వాదనతో తప్పులు మాట్లాడడంతో అడ్డంగా బుక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో….
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడ ఉంది సార్ ? అని ఓ మీడియా మిత్రుడు ప్రశ్నిస్తే.. ఆగి ఆగి సమాధానం ఇచ్చిన బొత్స సత్యనారాయణ ఒకటి రెండు రోజుల్లో మీకే తెలుస్తుందిగా..! అంటూ చెప్పుకొచ్చారు. ఇది సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. ఇలాంటి మంత్రులా మన ఖర్మ అనే కామెంట్లు పడ్డాయి. ఇదొక్కటే కాదు.. గతంలోనూ ఆయనపై తీవ్ర విమర్శలు.. కామెంట్లు పడ్డాయి. రాజధానిలో ఏముంది శ్మశానం అన్నప్పుడు.. చాలా మంది.. బొత్స సత్యనారాయణకు యాంటీగా పెట్టిన పోస్టులు నెలల తరబడి వైరల్ అయ్యారు.
మారతారో? లేదో?
ఇక, బొత్స సత్యనారాయణ మీడియా మీటింగ్ అంటే.. ట్రాన్స్‌లేటర్‌ను పెట్టుకోండి సార్.. అనే కామెంట్లు సీఎంవో వర్గాల్లో వినిపిస్తున్నాయట. ఇలా.. మొత్తంగా పరిస్థితిని గమనిస్తే.. బొత్స సత్యనారాయణ మంచినాయకుడే .. సీనియార్టీ ఉన్న నాయకుడే అయినా తత్తరపాటు.. సబ్జెక్ట్ లేమి బొత్స సత్యనారాయణకు అదే ఇబ్బందిగా ఉందన్నది వాస్తవం. మరి బొత్స సత్యనారాయణ మారతారో? లేదో ?