బొత్స హడావుడే తప్ప… ?
జగన్ క్యాబినెట్ లో ఉన్న సీనియర్ మంత్రులలో బొత్స సత్యనారాయణ ఒకరు. ఆయన 2004లో వైఎస్సార్ అధికారంలోకి రావడంతోనే తొలిసారి మంత్రి అయ్యారు. ఎన్నో కీలకమైన శాఖలు [more]
జగన్ క్యాబినెట్ లో ఉన్న సీనియర్ మంత్రులలో బొత్స సత్యనారాయణ ఒకరు. ఆయన 2004లో వైఎస్సార్ అధికారంలోకి రావడంతోనే తొలిసారి మంత్రి అయ్యారు. ఎన్నో కీలకమైన శాఖలు [more]
జగన్ క్యాబినెట్ లో ఉన్న సీనియర్ మంత్రులలో బొత్స సత్యనారాయణ ఒకరు. ఆయన 2004లో వైఎస్సార్ అధికారంలోకి రావడంతోనే తొలిసారి మంత్రి అయ్యారు. ఎన్నో కీలకమైన శాఖలు నిర్వహించి పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్ రేసులో కూడా ఉన్నారు. కాలం ఖర్మం కలసిరాక ఆయన అలాగే ఉండిపోయారు. అయితే రాజకీయంగా తెలివిడి ఉంది కాబట్టి ఒక మెట్టు దిగి జగన్ పార్టీలో చేరాను అని చెబుతారు. ఇక ఆయన వైసీపీ అధికారంలోకి వస్తే టొటల్ గా చక్రమే తిప్పేస్తారు అని అంతా భావించారు. కానీ హడావుడి మాత్రమే తప్ప అంత సీన్ లేకుండా పోతోంది అంటున్నారు.
బోల్డ్ స్టేట్మెంట్స్ తో….
మరో వైపు చూస్తే కొన్ని కీలకమైన అంశాలల్లో బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి పార్టీని ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశారు అని అంటారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో జాగ్రత్తగా స్మూత్ గా డీల్ చేయకుండా వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత పెరిగేలా బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారని అంటారు. ఆయన సీనియారిటీ అక్కడ అలా తేలిపోయింది అని కూడా చెబుతారు. అమరావతిలో ఏముంది అంటూ ఆయన చేసిన తేలికైన విమర్శలతో ప్రభుత్వం పట్ల ఒక వర్గం ఆగ్రహం పెంచుకుందని అంటారు. ఇక ఈ మధ్య కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు రాజధాని రావడం ఖాయమని బొత్స సత్యనారాయణ ప్రకటించి మరో చిచ్చు రేపారు అంటారు. ఒక వైపు న్యాయస్థానాల్లో ఈ వివాదం ఉంటే బొత్స ఎలా మాట్లాడుతారు అని విపక్షాలు గుస్సా అయ్యాయి కూడా.
డీల్ చేయలేక …?
ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. కానీ ఆయన అక్కడ కూడా మొత్తం జిల్లా రాజకీయాలను డీల్ చేయలేకపోతున్నారు అంటున్నారు. తానూ తన కుటుంబం అని గిరిగీసుకుని పార్టీలో ఒక వర్గం నేతగానే మారిపోయారని అంటున్నారు. కనీసం జిల్లా వరకైనా ఏకచత్రాధిపత్యం ఆయనకు దక్కకుండా పోవడానికి వ్యవహార శైలి కారణమని చెబుతారు. బొత్స సత్యనారాయణ జిల్లా రాజకీయాల్లో కూడా సొంత పార్టీలో తన వారూ పరవారూ అంటూ లెక్కలు చూసుకోవడంతోనే అందరి వాడు కాలేకపోతున్నారు అంటున్నారు.
కంటిన్యూ అవుతారా…?
ఆ మధ్య ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. బొత్స సత్యనారాయణను మరో రెండున్నరేళ్ళ పాటు మంత్రిగా కొనసాగించరు అన్నదే దాని సారాంశం. బొత్స సత్యనారాయణకు బదులుగా ఆయన కోరిన వారికి కానీ అవసరం అయితే ఆయన తమ్ముడికైనా మంత్రి పదవి ఇవ్వడానికి హై కమాండ్ కొత్త ఆలోచన చేస్తోంది అంటున్నారు. మరి బొత్స దీనికి ఒప్పుకుంటారా. ఎమ్మెల్యేలలో మెజారిటీని తన వర్గంగా చేసుకున్నా బొత్స తిరుగుబాటు చేస్తే రాజకీయంగా అది వైసీపీకి భారీ నష్టం కలిగిస్తుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా విస్తరణలో బొత్స సత్యనారాయణ మంత్రి పదవి ఉంటుందా లేదా అన్నది ఇపుడు కొత్త చర్చగా వస్తోంది. అయితే బొత్స మార్క్ పాలిటిక్స్ ప్లే చేసి కొనసాగుతారు అన్న వారూ ఉన్నారు.