బొత్స కావాలనే చేస్తున్నారా?

బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి తుట్టెను కదిలించారు. కదిలిస్తూనే ఉన్నారు. రాజధాని తాత్కాలికం [more]

Update: 2019-09-09 13:30 GMT

బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి తుట్టెను కదిలించారు. కదిలిస్తూనే ఉన్నారు. రాజధాని తాత్కాలికం మాత్రమేనన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు మళ్లీ అగ్గిని రాజేశాయి. రాజధాని అమరావతి విషయంపై విపక్షాలు ఇప్పుడిప్పుడే మరచి పోతున్న సమయంలో బొత్స సత్యనారాయణ తిరిగి అమరావతి టాపిక్ ను తెచ్చి అయోమయంలో పడేశారు.

పదే పదే అదే వ్యాఖ్యలు….

బొత్స సత్యనారాయణ పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తుండటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతితోనే అన్నది స్పష్టంగా తెలుస్తోంది. తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికాలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఇది అన్యాపదేశంగా అన్న మాటలేఅని వైసీపీ నేతలే భావించినప్పటికీ విపక్షాలు మాత్రం రాజధాని విషయంలో ఆందోళనకు దిగాయి. జగన్ అమెరికా నుంచి వచ్చని తర్వాత సీఆర్డీఏ సమీక్షను కూడా నిర్వహించారు.

జగన్ మనసులో…..

జగన్ సమీక్షలో ఖచ్చితంగా అమరావతిపై చర్చించి ఉంటారు. అయితే బొత్స సత్యానారయణ మాత్రం రాజధాని పై తన టోన్ మార్చలేదు. తాజాగా అమరావతి తాత్కాలికమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం పిన్ కోడ్ కూడా అమరావతికి లేదన్నారు. అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని చెప్పారు. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించి చంద్రబాబు అమరావతిని తాత్కాలికం చేశారని దుయ్యబట్టారు.

అనుమతితోనే….

అయితే ఇంతకీ జగన్ మనసులో ఏముంది? జగన్ అనుమతితోనే బొత్స సత్యనారాయణ పదే పదే అమరావతి విషయాన్ని ప్రస్తావిస్తున్నారా? అన్న అంశం వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణ జగన్ అనుమతి లేకుండా కీలక అంశంపై పదే పదే కాంట్రవర్సీ చేయరన్నది అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి బొత్స వ్యాఖ్యలు అగ్గిని రాజేశాయి. ఇంతకీ రాజధాని విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం స్పష్టం కాలేదు. దీనిపై టీడీపీ, జనసేన, కమ్యునిస్టు, బీజేపీ లు ఆందోళనకు దిగాయి.

Tags:    

Similar News