తోకలు కత్తిరిస్తారటగా

విజయనగరం రాజకీయాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ రూటే సెపరేట్. ఆయన‌ది మూడు దశాబ్దాల రాజకీయ జీవితం. జిల్లాలో కురువృధ్ధుడు పెన్మత్స సాంబశివరాజు శిష్యునిగా ఎంట్రీ ఇచ్చిన బొత్స [more]

Update: 2019-12-12 05:00 GMT

విజయనగరం రాజకీయాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ రూటే సెపరేట్. ఆయన‌ది మూడు దశాబ్దాల రాజకీయ జీవితం. జిల్లాలో కురువృధ్ధుడు పెన్మత్స సాంబశివరాజు శిష్యునిగా ఎంట్రీ ఇచ్చిన బొత్స సత్యనారాయణ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా తొలుత పనిచేశారు. ఆ తరువాత ఆయన జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ లో వివిధ పదవుల్లో రాణించారు. ఇక వైఎస్సార్ సన్నిహితునిగా మారిన తరువాత దశ ఒక్కసారిగా తిరిగింది. పాత కాంగ్రెస్ వాదులతో బంధం ఉన్న సాంబశివరాజు వైఎస్సార్ వెనక నడవలేకపోయారు. అది ఛాన్సుగా తీసుకున్న బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో దూసుకుపోయారు. విజయనగరం జిల్లా వరకూ వైఎస్సార్ గ్రూప్ కి పెద్ద దిక్కు అయిపోయారు. అలా వైఎస్సార్ హయాంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన ఆయన పీసీసీ చీఫ్ గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఒక దశలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్న బొత్స సత్యనారాయణకు కాలం కలసిరాలేదు. ఇక విభజన తరువాత కాంగ్రెస్ పుట్టె మునగడంతో వాస్తవాలు ముందే గ్రహించిన బొత్స సత్యనారాయణ వైసీపీ రూట్ పట్టారు.

ఏకపక్షంగా….

జగన్ వంటి మొండి వాడిని సైతం తన దారికి తెచ్చుకుని కోరుకున్న విధంగా జిల్లా రాజకీయాలలో హవా చాటడం ఒక్క బొత్స సత్యనారాయణ వల్లనే అయిందని అంటారు. ఫ్యామిలీ ప్యాక్ లు తన దగ్గర చెల్లవు అని జగన్ చెప్పినా కూడా బొత్స మాత్రం పట్టుపట్టి తన వారికే టికెట్లు తెచ్చుకున్నారు. తన సోదరుడు, బంధువులు ఇలా విజయనగరంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో మెజారిటీ బొత్స సత్యనారాయణ అనుచరులు, చుట్టాలే. విజయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ కూడా బొత్స బంధువే. మరి ఈ విధంగా జిల్లా రాజకీయాలను గుప్పిట పట్టేసి అంతా తాను అనుకున్నట్లే నడిపిస్తున్న బొత్స సత్యనారాయణ వైఖరి పట్ల వైసీపీ హై కమాండ్ దృష్టి పెట్టిందని అంటున్నారు. బొత్స సింగిల్ హ్యాండ్ పాలిటిక్స్ కి చెక్ చెప్పేలా పావులు కదుపుతోందని కూడా ప్రచారం సాగుతోంది. బొత్స సత్యనారాయణ వల్ల పార్టీలో మిగిలిన వారు సైతం వెనకబడిపోతున్నారు. ఎక్కడైనా జగన్ కానీ విజయనగరంలో మాత్రం బొత్స సత్యనారాయణ మా బాస్ అంటున్న వారి తోక కత్తిరించేందుకు కూడా కధ సిధ్ధం చేస్తున్నారుట.

జెడ్పీ పీఠంపైన….

తొందరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతిష్టాత్మకమైన విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్ సీటు మీద బొత్స సత్యనారాయణ అపుడే తన వర్గం వారిని కూర్చోబెట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఇక్కడే హై కమాండ్ కూడా అలెర్ట్ అవుతోంది. బెంగుళూర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు గా ఉంటూ వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న జిల్లాలోని పార్వతీపురం వాసి అయిన ఒక యువ నాయకుడిని విజయనగరం జెడ్పీ పీఠంపైన కూర్చోబెట్టాలని జగన్ పావులు కదుపుతున్నారట. తన మనిషిగా ఉన్న ఆయన్ని రంగంలోకి దింపి కీలకమైన జెడ్పీ పీఠం అప్పగించడం ద్వారా జిల్లా రాజకీయాలను బ్యాలన్స్ చేయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ మధ్య పార్వతీపురంలో జరిగిన వన మహోత్సవంలో ఈ యువనేత చేసిన హడావుడి జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిందట. జగన్ కి నమ్మిన బంటుగా ఉన్న ఆయన కనుక రాజకీయ తెర మీదకు వస్తే బొత్స సత్యనారాయణ వర్గం ఏకపక్ష రాజకీయానికి చెక్ పడినట్లేనని అంటున్నారు. మొత్తానికి జగన్ బొత్స సత్యనారాయణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News